Shame On Jagan : కేసీఆర్ సచివాలయం.. మోదీ పార్లమెంట్ నిర్మిస్తే వైఎస్ జగన్ ఏం చేస్తున్నారో చూడండి.. సిగ్గో సిగ్గు..!

ABN , First Publish Date - 2023-05-29T20:58:49+05:30 IST

అవును.. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Telangana CM KCR) హైదరాబాద్‌లో కొత్త సచివాలయం (TS New Secretariat) నిర్మించారు.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కూడా ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) కట్టుకున్నారు...

Shame On Jagan : కేసీఆర్ సచివాలయం.. మోదీ పార్లమెంట్ నిర్మిస్తే వైఎస్ జగన్ ఏం చేస్తున్నారో చూడండి.. సిగ్గో సిగ్గు..!

అవును.. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Telangana CM KCR) హైదరాబాద్‌లో కొత్త సచివాలయం (TS New Secretariat) నిర్మించారు.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కూడా ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) కట్టుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా నిర్మించిన దాఖలాలు ఉన్నాయా..? పోనీ అంతటి పెద్ద పెద్ద నిర్మాణాల సంగతి దేవుడెరుగు.. చెప్పుకోదగిన కట్టడాలు ఏమైనా ఉన్నాయా..? పోనీ గత ప్రభుత్వాలు కట్టిన కట్టడాలేమైనా అలాగే ఉండనిచ్చారా..? అంటే అబ్బే అస్సల్లేవే అని ప్రతిపక్ష పార్టీ నేతలు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో కౌంటర్లు పేలుస్తున్నారు. ఈ విమర్శలకు వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు రియాక్ట్ అవుతూ వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ జగన్ అధికారంలోకి వస్తే చేస్తానన్నవేంటి..? అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేంటి..? కేంద్రం కోట్లల్లో నిధులు ఇస్తుంటే జగన్ ఒక్కటీ నిర్మించకుండా ఏం చేస్తున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

YS-Jagan-and-modi.jpg

కేసీఆర్ కొత్త సచివాలయం కట్టారిలా..!?

తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే ప్రజాస్వామ్య దీపికగా హైదరాబాద్ (Hyderabad) నగరం నడిబొడ్డున రాజసానికి అద్దంపట్టేలా నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ తన హయాంలో నిర్మించారు. 617 కోట్ల రూపాయలతో 6 అంతస్తుల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో (28 ఎకరాలు) కొత్త సచివాలయం నిర్మాణం జరిగింది.150 ఏళ్లపాటు నిలిచేలా, తీవ్ర భూప్రకంపనలు సైతం తట్టుకునేలా నిర్మించింది కేసీఆర్ సర్కార్ (KCR Govt). నీలకంఠేశ్వరాలయం, వనపర్తి ప్యాలెస్‌, సారంగాపూర్‌ హనుమాన్‌ (Hanuman Temple) ఆలయం స్ఫూర్తిగా సచివాలయాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. సచివాలయం ప్రారంభోత్సవం కూడా అంగరంగ వైభవంగా కేసీఆర్ చేశారు. 265 అడుగుల ఎత్తున ఈ భవనంలో 11 అంతస్తులు ఉన్నాయి. కాగా.. ఈ కాలానికి తగ్గట్టు ఆధునిక సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లతో భవనం నిర్మితమైంది. గతంలో సచివాలయం అంటే పైరవీకారులు, వివిధ సమస్యలపై ఆందోళన చేసేవారు.. ఎవరైనా, ఎప్పుడంటే అప్పుడు లోనికి దూసుకెళ్ళేవారు. కానీ ఇప్పుడా సమస్యలేదు. ముందస్తు అనుమతి ఉంటేనే సచివాలయంలోనికి వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ్నుంచే అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో చూడదగ్గ ప్రదేశాలంటే.. చార్మినార్ (Charminar), సైబర్ టవర్స్‌ (Cyber Towers) లాంటివి ఉండగా.. ఇప్పుడు సచివాలయం కూడా ఆ జాబితాలోకి చేరింది.

kcr-new-sachivalayam.jpg

పార్లమెంట్‌ను ప్రధాని ఎలా కట్టారంటే..!

సనాతన ధర్మం ఉట్టిపడేలా, అత్యాధునిక హంగులతో దేశ రాజధాని నడిబొడ్డున, పాత పార్లమెంట్‌కు పక్కనే.. కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) ప్రధాని మోదీ (PM Modi) తన హయాంలో నిర్మించారు. రూ.970 కోట్ల వ్యయంతో 64,500 చదరపు మీటర్లలో త్రికోణాకారంలో ఈ భవన నిర్మాణం జరిగింది. అతి తీవ్ర భూకంపాలను సైతం తట్టుకునేలా లోక్‌సభను జాతీయ పక్షి నెమలి, రాజ్యసభను జాతీయ పుష్పం కమలానికి ప్రతీకగా తీర్చిదిద్దారు. నెమలి పింఛాన్ని పోలిన విధంగా గోడలపై నిర్మాణాలు చేశారు. అదేవిధంగా లోపలి పైకప్పు కూడా నెమలి పింఛాన్ని పోలిన విధంగా నిర్మించారు. పాత లోక్‌సభ ప్రాంగణం కంటే కూడా కొత్తది రెండు రెట్లు పెద్దది. పెద్దల సభను.. కమలం థీమ్‌తో, పాత సభ కన్నా ఒకటిన్నర రెట్లు పెద్దదిగా నిర్మించారు. యూపీకి చెందిన 900 మంది కళాకారులు 10 లక్షల పనిగంటలు శ్రమించి చేతితో నేసిన ప్రీమియం కార్పెట్లు కొత్త లోక్‌సభ, రాజ్యసభను అలంకరించాయి. తీవ్ర వివాదాల నడుమ మే-28న ఆదివారం నాడు ప్రధాని మోదీ చేతుల మీదుగా పార్లమెంట్ భవన్ ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం ఈ భవనాన్ని జాతికి అంకితమిచ్చారు ప్రధాని.

Modi-new-parliament.jpg

జగన్ అధికారంలోకి వచ్చాక చేసిందేంటి..!?

ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అది చేస్తాం.. ఇది చేస్తామని ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అన్నీ సిగ్గు లేకుండా కూల్చివేతలే కానీ.. కట్టిందేమైనా ఉందా అంటే జీరోనే అని ప్రతిపక్షాలు ప్రతిరోజూ దుమ్మెత్తిపోస్తున్నాయి. పోనీ గత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రధాన కట్టడాలు అయినా కనీసం కొనసాగించారా..? అంటే అబ్బే అదీ లేదని ఆరోపణలు మెండుగా ఉన్నాయ్. టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు (Chandrababu).. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని (Amaravathi) మలేసియా, సింగపూర్ రేంజ్‌లో నిర్మించాలని ఎన్నో కలలు కన్నారు. ఇప్పటికే కొన్ని భవంతులను నిర్మించగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. జగన్ సీఎం అయ్యాక అమరావతిని అస్సలు పట్టించుకోకుండా.. మూడు రాజధానులు (Three Capitals) అని చెప్పి ఇంతవరకూ ఒక్క ఇటుకా వేయలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టుల్లో నడుస్తోంది..! ఇక కూల్చివేతలు అంటారా.. ప్రజావేదికతో మొదలై నాన్ స్టాప్‌గా ముందుకెళ్తూనే ఉన్నాయి. అంతేకాదు.. ఆఖరికి కొండలు, గుట్టలు.. ఊపిరిపోసే చెట్లను కూడా వదలకుండా ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారనే ఆరోపణలు బోలెడన్ని ఉన్నాయి. పోనీ.. కేంద్రం నిధులివ్వట్లేదు.. రాష్ట్రానికి ఆదాయం లేదా అంటే బోలెడంత ఉంది.. అయినప్పటికీ జగన్ చేసిందేమిటంటే అన్నీ ప్రశ్నార్థకాలే వస్తున్నాయే తప్ప ఫలానా అని చెప్పుకోవడానికి మాత్రం ఏమీలేవు. ఎంతసేపు నవరత్నాలు.. నవరత్నాలు అనడం.. బటన్లు నొక్కడం తప్ప అభివృద్ధి అక్కర్లేదా అనే ప్రశ్నలు ఏపీ ప్రజలు, రాజకీయ నిపుణులు, ప్రజా సంఘాల నుంచి వస్తున్నాయ్.

YS-Jagan.jpg

వైసీపీ వీరాభిమానులు ఇలా..!

సోషల్ మీడియాలో (Social Media) జగన్‌పై ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తుండగా.. వైసీపీ వీరాభిమానులు (YSRCP Fans), కార్యకర్తలు మాత్రం కేసీఆర్ సచివాలయం ఒక్కటే కట్టారని తమ ప్రభుత్వం మాత్రం సచివాలయాలే (Grama, Ward Sachivalayam) కట్టిందని చెప్పుకుంటున్నారు. ప్రతి గ్రామానికి గ్రామానికి, వార్డుకో సచివాలయం కట్టిన ఘనత తమదే అన్నట్లుగా గొప్పలు చెప్పుకుంటూ ఉండటం గమనార్హం. అంతేకాదు.. కేసీఆర్ సచివాలయం కట్టింది రెండోసారి అధికారంలోకి వచ్చాకనే.. పార్లమెంట్‌ను మోదీ కట్టింది కూడా రెండోసారి అధికారంలోకి వచ్చాకనే.. వైసీపీ కూడా రెండోసారి అనగా 2024లో అధికారంలో వస్తే అప్పుడే అసలు సినిమా ప్రారంభం అవుతుందని.. విమర్శకులకు కౌంటర్లిచ్చే ప్రయత్నం చేస్తున్నారు వీరాభిమానులు. పక్కరాష్ట్రంలో ఉండే సచివాలయాన్ని టీవీల్లో.. ఇప్పుడు ప్రారంభోత్సవానికి నేరుగా వెళ్లి చూసిన తర్వాత అయినా జగన్ మనసు మారి చెప్పుకోదగ్గ నిర్మాణాలు ఏమైనా చేపడుతారేమో వేచి చూడాల్సిందే మరి..!

Prajavedika.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

YSRTP : బెంగళూరు వెళ్లి మరీ డీకేను కలిసిన వైఎస్ షర్మిల.. 15 రోజుల వ్యవధిలోనే రెండోసారి.. ఏం నడుస్తోంది..?

******************************

YSRCP Survey Leak : వామ్మో.. ఇంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ టికెట్లు ఇవ్వట్లేదా.. నంబర్ ఎంతో తెలిస్తే..!

******************************

KCR Vs Modi Govt : కేసీఆర్-కేజ్రీవాల్ భేటీతో ఊహాగానాలకు చెక్ పడినట్లే.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!

******************************

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

******************************
BRS Vs Congress : నిజంగానే కాంగ్రెస్‌కు 50 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు లేరా.. హరీష్ ఏ లెక్కన చెప్పారు.. అన్నీ సరే గానీ..!

******************************

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత సేఫ్.. ఎక్కడా కనిపించని పేరు.. క్లీన్ చిట్ వచ్చేసినట్లేనా..!?

******************************

Modi Vs Kcr : కర్ణాటక ఫలితాలు, గవర్నర్ వ్యవస్థను ప్రస్తావించి మరీ కేంద్రంపై కేసీఆర్ ఫైర్..

******************************

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

******************************

Jagan In YS Viveka Case : పెను సంచలనం.. వివేకా హత్యకేసులో సీఎం వైఎస్ జగన్ పేరు..

******************************

TS Politics : తెలంగాణ బీజేపీకి ఊహించని ఝలక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత.. స్క్రిప్ట్ మారుతోందే..!

******************************

Updated Date - 2023-05-29T21:06:39+05:30 IST