YSRTP : బెంగళూరు వెళ్లి మరీ డీకేను కలిసిన వైఎస్ షర్మిల.. 15 రోజుల వ్యవధిలోనే రెండోసారి.. ఏం నడుస్తోంది..?

ABN , First Publish Date - 2023-05-29T15:12:22+05:30 IST

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) చుట్టూ తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) తిరుగుతున్నాయ్. షర్మిల పాదయాత్ర (Sharmila Padayatra) చేసినా.. ప్రభుత్వాన్ని విమర్శించినా.. ధర్నాలు చేసినా, నిరసనలు చేపట్టినా ప్రతిదీ సంచలనమే అవుతోంది..

YSRTP : బెంగళూరు వెళ్లి మరీ డీకేను కలిసిన వైఎస్ షర్మిల.. 15 రోజుల వ్యవధిలోనే రెండోసారి.. ఏం నడుస్తోంది..?

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) చుట్టూ తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) తిరుగుతున్నాయ్. షర్మిల పాదయాత్ర (Sharmila Padayatra) చేసినా.. ప్రభుత్వాన్ని విమర్శించినా.. ధర్నాలు చేసినా, నిరసనలు చేపట్టినా ప్రతిదీ సంచలనమే అవుతోంది. దీంతో ఆమె ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు తరుముకొస్తుండటంతో షర్మిల ఏం చేయబోతున్నారు..? ఒంటిరిగానే ఎన్నికలకు వెళ్తారా..? ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారా..? ఒకవేళ ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో అన్ని చోట్ల పోటీచేస్తారా..? లేకుంటే పార్టీకి బలం ఉన్న చోట మాత్రమే పోటీచేస్తారా..? ఇవన్నీ పెద్ద ప్రశ్నలుగా మిగిలిపోయాయ్. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌తో (Congress) కలిసి షర్మిల.. ముందుకెళ్తున్నారని అంతేకాదు విలీనం కూడా చేయబోతున్నారనే పెద్ద ఎత్తున టాక్ వచ్చింది. ఆ ఆరోపణలను షర్మిల తిప్పికొట్టినప్పటికీ తాజా పరిణామాలతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో (Telugu States), కర్ణాటకలో (Karnataka) హాట్ టాపిక్ అయ్యారు. ఇందుకు కారణం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌తో వైఎస్ షర్మిల (DK Shivakumar-YS Sharmila) బెంగళూరు వెళ్లి మరీ భేటీ కావడమే. అయితే ఈ భేటీ 15 రోజుల్లో ఇలా భేటీ జరగడం ఇది రెండోసారి కావడంతో అసలేం జరుగుతోంది..? ఈ వరుస భేటీల వెనుక ఆంతర్యమేంటి..? అని సోషల్ మీడియా (Social Media), మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలొస్తున్నాయ్.

YS-Sharmila-dn-DD.jpg

ఒక్క భేటీ.. రకరకాలుగా చర్చ..!

కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ సాయశక్తులా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇటీవలే డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణ స్వీకారం కూడా చేశారు. పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసిన, ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు కూడా డీకేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల కూడా ట్విట్టర్ వేదికగా డీకేను అభినందించి శుభాకాంక్షలు తెలిపి.. డీకే-వైఎస్ కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. అదలా ఉంచితే.. సోమవారం నాడు మరోసారి నేరుగా బెంగళూరుకు వెళ్లి మరీ డీకే శివకుమార్‌ను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని డీకేను.. షర్మిల అభినందించారు. ఈ సందర్భంగా.. మరోసారి దివంగత నేత వైఎస్సార్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని డీకే గుర్తు చేసుకున్నారు. అటు షర్మిల భేటీ అయ్యారో లేదో.. ఇటు తెలంగాణ రాజకీయాల్లో చిత్రవిచిత్రాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ భేటీ వెనుక మతలబు వేరే ఉందని సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో హడావుడి నడుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్-వైఎస్సార్టీపీ పొత్తు పెట్టుకోబోతున్నాయని.. అందుకే ఇలా వరుస ట్వీట్లు, భేటీలు జరుగుతున్నాయని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. ఇక కొన్ని మీడియా సంస్థలు అయితే పుంకాలు పుంకాలుగా కథనాలు అల్లేస్తున్నాయ్.

DK-and-Sh.jpg

రాయబారమా..!?

వాస్తవానికి కాంగ్రెస్-వైఎస్సార్టీపీ పొత్తు, విలీనం గురించి వార్తలు రావడం ఇదేమీ కొత్తకాదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ.. షర్మిల సుదీర్ఘంగా ఫోన్‌లో మాట్లాడుకున్నారని వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి వైఎస్ కార్డును వాడటానికి హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. షర్మిల ప్రచారం చేస్తే కచ్చితంగా కాంగ్రెస్ కలుసొస్తుందన్నది కాంగ్రెస్ పెద్దల ప్లానట. అయితే.. ఈ వార్తలన్నీ అవాస్తవాలేనని వైఎస్సార్టీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. అసలు ఆ ఆలోచనే లేదని షర్మిల ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఆ ఎపిసోడ్‌కు అక్కడితో ఫుల్‌స్టాప్ పడింది. అయితే తాజాగా బెంగళూరు వెళ్లి మరీ షర్మిల భేటీ కావడంతో అసలేం జరుగుతోందని అర్థం కాని పరిస్థితి. ఇదివరకే హైదరాబాద్‌లో ఒకసారి భేటీ జరగ్గా.. ఇప్పుడు బెంగళూరులో భేటీ కావడంతో అటు కర్ణాటక.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో షర్మిల చర్చనీయాంశమయ్యారు. పొత్తు పొడుస్తోంది కాబట్టే ఇన్నిసార్లు భేటీ అవుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. షర్మిలతో ప్రియాంకతో మాట్లాడటం.. ఆ తర్వాత డీకేను రంగంలోకి దింపడం ఈ వరుస పరిణామాలతో కచ్చితంగా కాంగ్రెస్-వైఎస్సార్టీపీల పొత్తు గానీ.. లేకుంటే విలీనం కానీ ఉంటుందని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చాక షర్మిలకు కీలక పదవులు కట్టబెడతామని కూడా హైకమాండ్ మాటిచ్చినట్లుగా తెలుస్తోంది. డీకే-వైఎస్ కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. శివకుమార్‌తోనే రాయబారం నడుపుతున్నట్లుగా సమాచారం. ఇవాళ సుమారుగా అరగంటకు పైగా జరిగిన భేటీలో పొత్తుల గురించే చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. వైఎస్ కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయో.. అంతకుమించి బెంగళూరులో ఉన్నాయన్నది జగమెరిగిన సత్యమే.. ఆ ఆస్తులను కాపాడుకోవడానికే.. ప్రభుత్వం మారగానే షర్మిల బెంగళూరు వెళ్లారనే టాక్ కూడా నడుస్తోంది.

YSRTP-and-Congress.jpg

ఏం జరుగునో..!?

రాజకీయాల్లో ఎవరికీ శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అంటే వైఎస్సార్.. వైఎస్ అంటేనే కాంగ్రెస్ అన్నట్లుగా అప్పట్లో పరిస్థితులుండేవి. వైఎస్సార్ మరణం, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు గడ్డు రోజులొచ్చాయ్. ఆ తర్వాత వైఎస్సార్టీపీ పార్టీ పెట్టిన షర్మిల.. ప్రతిసారీ ఇప్పుడున్న కేసీఆర్ కుటుంబ పాలన పోయి.. ‘రాజన్న రాజ్యం’ రావాలని చెప్పుకుంటూ వస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ తనతో లేకున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒంటరిగానే షర్మిల పోరాటం చేస్తున్నారు. సరిగ్గా దీన్నే హస్తం పార్టీ పెద్దలు అవకాశంగా తీసుకుని.. కాంగ్రెస్-వైఎస్సార్టీపీ కలిస్తేనే కేసీఆర్‌ను గద్దె దింపొచ్చని.. అది రెండు పార్టీ పొత్తు ద్వారా సాధ్యమవుతుందని చెప్పడానికే డీకే ద్వారా షర్మిలతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీల విషయంలో ఏమైనా జరగొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో నిజానిజాలెంత.. ఒకవేళ నిజమైతే పొత్తు తర్వాత ఫలితాలు ఏ మాత్రం వస్తాయనే విషయాలు తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడక తప్పదు మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

YSRCP Survey Leak : వామ్మో.. ఇంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ టికెట్లు ఇవ్వట్లేదా.. నంబర్ ఎంతో తెలిస్తే..!

******************************

KCR Vs Modi Govt : కేసీఆర్-కేజ్రీవాల్ భేటీతో ఊహాగానాలకు చెక్ పడినట్లే.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!


******************************

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

******************************
BRS Vs Congress : నిజంగానే కాంగ్రెస్‌కు 50 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు లేరా.. హరీష్ ఏ లెక్కన చెప్పారు.. అన్నీ సరే గానీ..!

******************************

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత సేఫ్.. ఎక్కడా కనిపించని పేరు.. క్లీన్ చిట్ వచ్చేసినట్లేనా..!?

******************************

Modi Vs Kcr : కర్ణాటక ఫలితాలు, గవర్నర్ వ్యవస్థను ప్రస్తావించి మరీ కేంద్రంపై కేసీఆర్ ఫైర్..

******************************

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

******************************

Jagan In YS Viveka Case : పెను సంచలనం.. వివేకా హత్యకేసులో సీఎం వైఎస్ జగన్ పేరు..

******************************

TS Politics : తెలంగాణ బీజేపీకి ఊహించని ఝలక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత.. స్క్రిప్ట్ మారుతోందే..!

******************************

Updated Date - 2023-05-29T15:15:44+05:30 IST