KCR Vs Modi Govt : కేసీఆర్-కేజ్రీవాల్ భేటీతో ఊహాగానాలకు చెక్ పడినట్లే.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!

ABN , First Publish Date - 2023-05-27T22:54:39+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (TS Chief Minister KCR) ఎందుకు సైలెంట్ అయ్యారు..? కేంద్రంపై యుద్ధం అని చెప్పి ఇప్పుడు చప్పుడు చేయట్లేదేం..? ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ (Abki Baar kisan Sarkar) అని నినదించిన కేసీఆర్ (KCR) ఇప్పుడు తెలంగాణకే ఎందుకు పరిమితం అయ్యారు..?

KCR Vs Modi Govt : కేసీఆర్-కేజ్రీవాల్ భేటీతో ఊహాగానాలకు చెక్ పడినట్లే.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (TS Chief Minister KCR) ఎందుకు సైలెంట్ అయ్యారు..? కేంద్రంపై యుద్ధం అని చెప్పి ఇప్పుడు చప్పుడు చేయట్లేదేం..? ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ (Abki Baar kisan Sarkar) అని నినదించిన కేసీఆర్ (KCR) ఇప్పుడు తెలంగాణకే ఎందుకు పరిమితం అయ్యారు..? కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నేతలు ఎవరూ లెక్క చేయట్లేదా..? అప్పట్లో హడావుడిగా దేశం మొత్తం తిరిగిన గులాబీ బాస్‌ను ఒంటరి చేశారా..? బీఆర్ఎస్-బీజేపీ (BRS, BJP) మధ్య చీకటి ఒప్పందం జరిగిందా..? ఇవే.. తెలంగాణలో నిన్న, మొన్నటి వరకూ రాజకీయ పార్టీల్లో, రాష్ట్ర ప్రజానీకంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇలా ఒకట్రెండు కాదు పదుల సంఖ్యలో ప్రశ్నలు వచ్చాయ్. పైగా కేసీఆర్ కూడా ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోవడంతో అసలేం జరుగుతోందో బీఆర్ఎస్ శ్రేణులకు సైతం అర్థం కాని పరిస్థితి. అయితే ఈ ఊహాగానాలన్నింటికీ ఒకే ఒక్క ప్రెస్‌మీట్‌‌తో కేసీఆర్ ఇప్పటి వరకూ వచ్చిన రూమర్స్‌కు చెక్ పెట్టేశారు. ఇంతకీ కేసీఆర్ఇచ్చిన క్లారిటీ ఏంటి..? బాస్ మీడియా మీట్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏం చర్చ సాగుతోంది..? అనే విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

Kejri-and-KCR.jpg

ఇదీ అసలు కథ..!

ఒకప్పుడు బీజేపీ అంటే ఒంటికాలిపై లేచే కేసీఆర్ ఈ మధ్య మోదీ తీసుకునే నిర్ణయాలపై, కన్నడనాట ఫలితాలపై మరీ ముఖ్యంగా రెండు వేల రూపాయిల నోట్ల రద్దుపై అస్సలు స్పందించలేదు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో అసలేం జరుగుతోందని ఎవరికీ అర్థం కాలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే నాడు కొత్త సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను (TS Governer) పిలవలేదని బీజేపీ నేతలు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నానా రచ్చ చేసిన విషయం అందిరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో బీజేపీకి ఇదొక అస్త్రం.. ఇప్పుడు కేసీఆర్ చేతుల్లోనూ ఒక అస్త్రం ఉంది. ఎలాగంటే.. కొత్త పార్లమెంట్ భవనం (New Parliament Building) రాష్ట్రపతి (President) చేతులు ప్రారంభించట్లేదు.. అంతేకాదు కనీసం ప్రారంభోత్సవానికి ఆహ్వానం కూడా లేదు.. దీన్ని బీఆర్ఎస్ ఒక సువర్ణావకాశంగా తీసుకోవచ్చు.. కానీ ఎందుకో ఈ విషయాన్ని కేసీఆర్ అస్సలు పట్టించుకోలేదు. ఇలా ఒకట్రెండు కాదు చాలా విషయాల్లో గులాబీ బాస్ ఎందుకు రియాక్ట్ కాలేదు. దీంతో అటు క్యాడర్‌లో.. ఇటు రాష్ట్ర ప్రజానీకంలో లేనిపోని ఊహాగానాలు పుట్టుకొచ్చాయ్. అయితే.. శనివారం నాడు జరిగిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్-కేసీఆర్ భేటీ, మీడియా మీట్‌తో మిలియన్ డాలర్ల ప్రశ్నలకు సమాధానం దొరికినట్లయ్యింది.

CM-KCR.jpg

తగ్గేదేలే అంటున్న కేసీఆర్..

ఢిల్లీలో ఐఏఎస్ (IAS), ఐపీఎస్‌ల (IPS) బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు మద్దతివ్వాలని సీఎం కేసీఆర్‌ను కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్‌లు కలుసుకున్నారు. సుమారు గంటన్నరపాటు తాజా రాజకీయ పరిణామాలు, కేంద్రం తెస్తున్న ఆర్డినెన్స్‌లు ఇలా అన్ని విషయాలు లోతుగా చర్చించారు. అనంతరం ముగ్గురు సీఎంలు కలిసి ప్రగతి భవన్ వేదికగా మీడియా మీట్ నిర్వహించారు. ఈ ఒక్క ప్రెస్‌మీట్‌తో ఇన్నిరోజులుగా తనపై వచ్చిన ఊహాగానాలు, చీకటి ఒప్పందం అంటూ వచ్చిన ఆరోపణలన్నింటికీ చెక్ పెట్టేశారు. ‘కర్ణాటకలో (Karnataka Election Results) కర్రుకాల్చి వాతపెట్టినా కేంద్రం మారకపోతే ఎలా..?. దేశాన్ని మోదీ ప్రభుత్వం ఎటు తీసుకెళ్తోంది..?. దేశంలో కేంద్రం అరాచకాలు, ఆగడాలు మితీమీరాయి. బేజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బంది పెడుతోంది. అసలు ఏందీ గవర్నర్ వ్యవస్థ. గవర్నర్ పదవి అలంకారప్రాయమైన పదవి. బడ్జెట్ పాస్ కానివ్వనని గవర్నర్ అంటే ఎలా..?. సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ పెట్టుకోవాల్సిన దుస్థితి. ఇంత ధౌర్భాగ్య పరిస్థితి ఎక్కడైనా ఉంటదా..?. అధికారుల బదిలీలన్నీ ఢిల్లీ ప్రభుత్వ హయాంలోనే జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోంది. కేంద్రం తెచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను పార్లమెంట్ వేదికగా వ్యతిరేకిస్తాం. ఆర్డినెన్స్‌ను ప్రధాని వెనక్కి తీసుకోవాలి. సుప్రీం తీర్పును అమలు చేయకపోవడమేంటి..? మీకై మీరే ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోండి.. ఇది మీకు, దేశానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. అండమాన్ పాలనకు ఢిల్లీ పాలనకు చాలా తేడా ఉంది, సుప్రీం తీర్పును కేంద్రం గౌరవించకపోతే దేశం పరిస్థితేంటి..?’ అని మునపటిలాగే కేసీఆర్ ఏ మాత్రం తగ్గకుండా కేంద్రంపై ఒంటికాలిపై లేచారు.

KCR-BRS.jpg

మొత్తానికి చూస్తే.. మునుపటిలానే కేసీఆర్ అదే ఫైర్ మీద ఉన్నారని.. ఇన్నిరోజులుగా వ్యూహాత్మకంగానే సైలెంట్‌గా ఉన్నారని ఈ ప్రెస్‌మీట్‌తో తేలిపోయింది. కేజ్రీవాలే.. కేసీఆర్‌ను వెతుక్కుంటూ వచ్చారంటే గులాబీ బాస్ పవర్ ఏంటి..? అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదేమో. ఎంత మౌనంగా ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం చేయాల్సిన పనులు లోలోపల చేసుకుంటూనే పోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సో.. దీన్ని బట్టి చూస్తే బాస్ ఎలాంటి చీకటి ఒప్పందాలకు పోలేదు.. కాస్త గ్యాప్ ఇచ్చారంతే.. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడీ విషయమే తెలంగాణ ప్రజానీకం చర్చించుకుంటోంది. ఇకపై అయినా కేసీఆర్ గురించి వస్తున్న రూమర్స్‌కు అడ్డుకట్ట పడుతుందో లేదో వేచి చూడాలి. మరీ ముఖ్యంగా కేసీఆర్ కామెంట్స్‌పై కేంద్రం, రాష్ట్రంలోని కమలనాథులు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో..!

******************************

ఇవి కూడా చదవండి..

******************************

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

******************************
BRS Vs Congress : నిజంగానే కాంగ్రెస్‌కు 50 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు లేరా.. హరీష్ ఏ లెక్కన చెప్పారు.. అన్నీ సరే గానీ..!

******************************

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత సేఫ్.. ఎక్కడా కనిపించని పేరు.. క్లీన్ చిట్ వచ్చేసినట్లేనా..!?

******************************

Modi Vs Kcr : కర్ణాటక ఫలితాలు, గవర్నర్ వ్యవస్థను ప్రస్తావించి మరీ కేంద్రంపై కేసీఆర్ ఫైర్..

******************************

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

******************************

Jagan In YS Viveka Case : పెను సంచలనం.. వివేకా హత్యకేసులో సీఎం వైఎస్ జగన్ పేరు..

******************************

TS Politics : తెలంగాణ బీజేపీకి ఊహించని ఝలక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత.. స్క్రిప్ట్ మారుతోందే..!

******************************

Updated Date - 2023-05-27T23:03:17+05:30 IST