Gym Heart Attacks: సడన్ హార్ట్ అటాక్ కారణంగా కుప్పకూలుతున్న వారిలో జిమ్‌కు వెళ్లే వాళ్లే ఎక్కువగా ఎందుకు ఉంటున్నారంటే..

ABN , First Publish Date - 2023-04-03T12:58:35+05:30 IST

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండెను సురక్షితంగా ఉంచుకోవడంతోపాటు తీవ్ర వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

Gym Heart Attacks: సడన్ హార్ట్ అటాక్ కారణంగా కుప్పకూలుతున్న వారిలో జిమ్‌కు వెళ్లే వాళ్లే ఎక్కువగా ఎందుకు ఉంటున్నారంటే..
Gym Heart Attacks

మీ గుండె సరిగ్గా పని చేస్తుందా? వ్యాయామం చేసేటప్పుడు గుండె సమస్యల సంకేతాల గురించి తెలుసా? భారతదేశంలో గుండెపోటు చాలా సాధారణమైన వ్యాధిగా మారిపోతుంది. ముఖ్యంగా చాలా సందర్భాలు యువత దీని భారిన పడి మరణిస్తున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఫిట్‌ గా, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారే దీనికి బలైపోవడం శోచనీయం.అసలు ఈ జిమ్, వ్యాయామం చేసేవారికి గుండెపోటుకు మధ్య సంబంధం ఉందా? జిమ్‌లో పని చేయడం వల్ల గుండె సమస్య, గుండెపోటు కారణంగా మరణించే అవకాశాలు పెరుగుతాయా?

గత కొన్ని నెలల్లో అనేక కేసులు ఉన్నప్పటికీ, జిమ్మింగ్‌లో ఉన్న, ఆరోగ్యకరమైన వ్యాయామ దినచర్యను అనుసరించే వారి విషయంలేనే గుండెపోటు ఎక్కువగా కనిపించింది. వర్కౌట్ వల్లనే గుండెపోటు సమస్య పెరిగిందనడానికి కూడా సరైన ధృవీకరించగల శాస్త్రీయంగా రుబుువు లేదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండెను సురక్షితంగా ఉంచుకోవడంతోపాటు తీవ్ర వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ (WHF) ప్రకారం, వ్యాయామం లేకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 50 శాతం పెరుగుతుందని వెల్లడించింది.

గుండెపోటుకు అత్యంత సాధారణ దోహదపడే కారకాలు

1. నిశ్చల జీవనశైలి

2. ధూమపానం

3. అధిక మద్యం వినియోగం

4. వ్యాయామం చేయడం లేదు

5. అధిక రక్త పోటు

6. నియంత్రణ లేని రక్తంలో చక్కెర స్థాయిలు

7. అధిక కొలెస్ట్రాల్

8. ఊబకాయం

9. టైప్-2 మధుమేహం

10. సంతృప్త కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం చాలా ముఖ్యం, అయితే అదే సమయంలో, ఆ వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరిస్తుందా లేదా అనేది గ్రహించాలి. దీర్ఘకాలిక విపరీతమైన వ్యాయామ శిక్షణ గుండెలోని కణజాలాలను దెబ్బతీస్తుంది. అవయవాల లోపల తీవ్రమైన నష్టానికి దారితీస్తుంది. అటువంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించడానికి శరీరానికి ఏది మంచిది. ఏది కాదు అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: డిప్రెషన్‌తో బాధపడేవాళ్లు ఈ ఐదింటిని కడుపులో దాచుకుని ఎంత ఇబ్బందిపడుతుంటారో పాపం..!

వ్యాయామం చేసే సమయంలో హార్ట్ ట్రబుల్ హెచ్చరికలు

వ్యాయామం చేస్తున్నప్పుడు సమస్యాత్మకమైన గుండెను ఎలా గుర్తించాలో చూద్దాం. జిమ్‌లో ఉన్నప్పుడు లేదా ఏదైనా వర్కవుట్ సెషన్ మధ్యలో ఉన్నప్పుడు, దిగువ పేర్కొన్న ఏవైనా సంకేతాలు కనిపించినప్పుడు అక్కడే ఆపివేయండి.

ఛాతీ అసౌకర్యం

ఆకస్మిక, తీవ్రమైన ఛాతీ నొప్పి రాబోయే ముందు గుండెపోటుకు ముందు తేలికపాటి అసౌకర్యంతో ప్రారంభమవుతుంది, తరువాత అధిక ఒత్తిడి, ఛాతీ మధ్యలో ఇబ్బందికరమైన భావన ఉంటుంది. ఈ లక్షణం కొన్ని నిమిషాల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వ్యాయామం చేయడం మానేసి, వైద్య సహాయం తీసుకోండి.

శ్వాస ఆడకపోవుట

వ్యాయామం చేసేటప్పుడు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారా? ఆగి చూసుకోమని గుండె హెచ్చరిస్తుంది. వ్యాయామం చేసే సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పి, ఛాతీలో అసౌకర్యం ,శ్వాస తీసుకోలేకపోవడం రాబోయే గుండెపోటుకు సంకేతం.

లైట్ హెడ్నెస్

శారీరక శ్రమ అలసటగా అనిపించవచ్చు, కానీ వ్యాయామం చేస్తున్నప్పుడు తల తిరగడం లేదా తేలికగా అనిపించడం అనేది పట్టించుకోవల్సిన సంకేతం.

హార్ట్ రిథమ్ అసాధారణతలు

హార్ట్ స్కిప్పింగ్, దడగా గుండె కొట్టుకోవడం అనేది గుండె సమస్యను సూచిస్తుంది. ఇలా అనిపించిన వెంటనే వ్యాయామం చేయడం మానేయాలి. వైద్య సహాయం తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: బరువు తగ్గాలని తెగ ట్రై చేస్తున్న వాళ్లలో అసలు ఎంతమందికి ఈ విషయం తెలిసి ఉంటుందో..!

విపరీతంగా చెమటలు పడుతుంటే..

విపరీతంగా చెమటలు పట్టడం అనేది గుండె సరిగ్గా పనిచేయడం లేదని గుండె లోపల ఏదో సమస్య ఉందని సూచిస్తుంది.

వేగవంతమైన హృదయ స్పందన

వేగవంతమైన హృదయ స్పందన రాబోయే గుండెపోటుకు మరొక సంకేతం.

శరీరం ఇతర భాగాలలో అసౌకర్యం

సమస్యాత్మక గుండె ఛాతీతో పాటు శరీరంలోని ఇతర భాగాలలో కూడా కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చేతులు, వీపు, మెడ, దవడ లేదా కడుపులో అసౌకర్యం, నొప్పి లేదా ఒత్తిడి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలలో దేనినైనా అనుభవిస్తే వెంటనే వైద్య సంరక్షణను తీసుకోవడం మంచిది.

Updated Date - 2023-04-03T12:58:35+05:30 IST