Depression: డిప్రెషన్‌తో బాధపడేవాళ్లు ఈ ఐదింటిని కడుపులో దాచుకుని ఎంత ఇబ్బందిపడుతుంటారో పాపం..!

ABN , First Publish Date - 2023-04-03T10:57:58+05:30 IST

కటిలో మగ్గడం, ఒంటరితనం, సిగ్గు, ఇవన్నీ హాని కలిగించే లక్షణాలు ఇలాంటివారు కనిపిస్తే కాస్త స్నేహంగా మెలిగితే వారు మనసులోని బాధనంతా చెప్పుకుంటారు.

Depression: డిప్రెషన్‌తో బాధపడేవాళ్లు ఈ ఐదింటిని కడుపులో దాచుకుని ఎంత ఇబ్బందిపడుతుంటారో పాపం..!
depression

డిప్రెషన్ మనిషి నిజమైన భావోద్వేగాలను దాచిపెడుతుంది, పైకి తెలియని ఆందోళన, భయం కారణంగా నెమ్మదిగా డిప్రెషన్ లోకి వెళతారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు మాట్లాడటానికి ఇష్టపడని 5 విషయాలు ఏంటంటే..

డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు

డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా అవమానం, అపరాధం భావం, నిస్సహాయత వంటి భావోద్వేగాలతో ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినపుడు వాళ్ళ మధ్యకు వారి మానసిక స్థితిని గురించి తీసుకురావడానికి ఇష్టపడరు.

కొందరు తమ లక్షణాలను దాస్తారు. ఎందుకంటే తనలోని అలజడి తెలిస్తే, ఆందోళన చెందకూడదనుకుంటారు. ఇతరులు సహాయం అడగడానికి చాలా ఇబ్బంది పడవచ్చు.

డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తులు చెప్పని విషయాలు

డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు దాచాలనుకునే 5 విషయాలు ఏంటంటే...ఎంత ఒంటరిగా, ఏకాంతంగా ఉంటే అంత బావుంటుందని భావిస్తారు: అన్ని భావాలను మాటల్లో చెప్పలేము కనుక ఒంటరితనం చాలావరకూ నయమని గట్టిగా నమ్ముతారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు తమ పరిస్థితిని ఇతరులు అర్థం చేసుకోలేరని భావిస్తారు.

ఇది కూడా చదవండి: ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఇలా తరిమేయండి.. లేదంటే పరిస్థితి దారుణంగా ఉంటుందట..!

చిరునవ్వు వెనుక దుఃఖాన్ని దాచడం: ఒక దశ తర్వాత, ఈ రుగ్మతతో బాధపడేవారు వారితో వారే పోరాడటానికి అలవాటు పడతారు. ఎందుకంటే ఎదుటివారికి తాము బావున్నామని చెప్పే విధానంలో ఇది ఒకటి కావచ్చు.

అలసిపోయినట్లు కనబడకుండా: డిప్రెషన్ సమయంలో పైకి బాగానే ఉన్నట్టు నటిస్తారు. లోపల ఎంత అలసిపోయినా సరే.

మానసిక లక్షణాలను దాచిపెట్టి: డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు మిగతావారితో కలిసిపోవడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ సరైన కారణం చెప్పడానికి బదులుగా, ఏవేవో కారణాలు చెప్పవచ్చు.

పనిని వాయిదా వేస్తారు:ఈ వ్యక్తులలో శక్తి చాలా తక్కువగా ఉంటారు, వారు కొన్నిసార్లు రోజువారీ పనులను వాయిదా వేస్తారు. మనసులోపలి భావాలను ఎదుటివారితో పంచుకోలేకపోవడం, చీకటిలో మగ్గడం, ఒంటరితనం, సిగ్గు, ఇవన్నీ హాని కలిగించే లక్షణాలు ఇలాంటవారు కనిపిస్తే కాస్త స్నేహంగా మెలిగితే వారు మనసులోని బాధనంతా చెప్పుకుంటారు. మనకెందుకులే అనుకుని వదిలేస్తే మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

Updated Date - 2023-04-03T11:01:15+05:30 IST