Heart Health: ఈ ఆరు విషయాలను లైట్ తీస్కుంటే గుండెపోటును కొనితెచ్చుకున్నట్టే.. మారకపోతే కష్టమే..!

ABN , First Publish Date - 2023-03-28T13:12:53+05:30 IST

అధిక బరువు గుండెకు హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Heart Health: ఈ ఆరు విషయాలను లైట్ తీస్కుంటే గుండెపోటును కొనితెచ్చుకున్నట్టే.. మారకపోతే కష్టమే..!
Human heart

1. మానవ హృదయానికి ప్రమాద కారకాలు..

మానవ హృదయం అనేక వ్యాధులకు లోనవుతుంది, చివరికి అది గుండె పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. దీనితో గుండె అనేక కారణాల వల్ల దెబ్బతింటుంది, కొన్ని అలవాట్లు మన జీవనశైలిలో అలవాటైతే, కొన్ని జీవనశైలి అలవాట్లు ఎటువంటి హెచ్చరిక సంకేతాలు ఇవ్వకుండానే క్రమంగా గుండెను బలహీనపరుస్తాయి. అవేంటంటే..

2. సాధారణం కంటే ఎక్కువ బరువు ఉండటం.

అధిక బరువు గుండెకు హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బొడ్డు ప్రాంతం చుట్టూ అధిక బరువు ఉండటం గుండెకు తీవ్రమైన ప్రమాద కారకం. ఇది గుండెను ఒత్తిడి చేస్తుంది అలాగే మధుమేహం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. అధిక బరువుతో ఉంటే, బరువులో కేవలం 5% నుండి 10% వరకు కోల్పోవడం వల్ల రక్తపోటు, బ్లడ్ షుగర్‌లో పెద్ద మార్పు వస్తుంది.

3. తక్కువ శారీరక శ్రమ

గుండె ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా ఉంచడంలో వ్యాయామాలు సహకరిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, ప్రస్తుత ప్రపంచ అంచనాల ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరు పెద్దవారిలో , 81% మంది కౌమారదశలో ఉన్నవారు తగినంత శారీరక శ్రమ చేయరు. గుండెపోటు, రక్తపోటు వంటి నాన్ కమ్యూనికేషన్ వ్యాధుల సంఖ్య 2020 , 2030 మధ్య ఎలా పెరుగుతుందో కూడా నివేదిక చూపిస్తుంది. ఏ పని లేకపోవడం వల్ల ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది, ఇది రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. తద్వారా గుండెపోటుకు దారితీస్తుంది.

ఇది కూడా చదవండి: ఎముకలు, చర్మం, కండరాల పెరుగుదలలో కీలకమైన సప్లిమెంట్ గురించి మీకు ఎంతవరకూ తెలుసు..!

4. కాలేయం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

గుండె ఆరోగ్యంతో కాలేయానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సైంటిఫిక్ సెషన్స్‌లో సమర్పించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ఆల్కహాల్ వల్ల కాలేయంలో కొవ్వు అసాధారణంగా పేరుకుపోవడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 2005 నుండి 2018 వరకు జాతీయ ఆరోగ్య సర్వే డేటాను అధ్యయనం చేసిన పరిశోధకులు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి పెద్దవారు, పురుషులు, మధుమేహం, కరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్నవారిలో ముఖ్యంగా గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటారు. కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాలు, ఉప్పును ఆహారం నుండి మినహాయించాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్, అసంతృప్త కొవ్వులు తీసుకోవాలి.

5. ఆల్కహాల్, పొగాకు అధిక వినియోగం

ఆల్కహాల్, పొగాకు అధిక వినియోగం వలన ప్రధాన ఆరోగ్యకరమైన జీవనశైలి పాడవుతుంది. రోజుకు మూడు, అంతకంటే ఎక్కువ మద్యపానం, సిగరెట్ ధూమపానం కొన్ని రకాల హృదయ సంబంధ వ్యాధులపై ఒకేలా, ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.ఈ ప్రభావాలలో రక్తపోటు పెరుగుదల, Triglycerides స్థాయిలు పెరుగుతాయి. రక్తం ,స్ట్రోక్, రక్తప్రసరణ గుండె వైఫల్యం, అధిక ప్రమాదాలు దీనితో పాటు పొంచి ఉంటాయి.

6. ఉప్పు ఎక్కువగా తినడం

వంట చేసేటప్పుడు తక్కువ ఉప్పును ఉపయోగిస్తున్నప్పటికీ, ప్రాసెస్ చేసిన ఆహారాల ద్వారా వినియోగించే లవణాల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజూ 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని WHO సిఫార్సు చేస్తోంది, ఇది ప్రపంచంలోని సగటు ప్రజలు తినే దానిలో దాదాపు సగం. మనం తీసుకునే ఉప్పులో ఎక్కువ భాగం ప్రాసెస్ చేసిన ఆహారాల నుండి వస్తుందని , శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉప్పు తీసుకోవడం తగ్గించాలని వైద్యనిపుణుల అధ్యయనాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-03-28T13:12:53+05:30 IST