Home » Videos » ABN Videos
కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సు ఆపి, అందులోనే నమాజ్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బస్సును ఉన్నఫలంగా ఆపి, సీటులో మోకాళ్లపై కూర్చుని మరీ నమాజ్ చేయడంతో.. ప్రార్థన పూర్తయ్యే వరకూ ప్రయాణికులంతా వేచి చూడాల్సి వచ్చింది. హుబ్లీ-హవేరి మార్గంలోని జవేరి సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఫోన్ కాల్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
ఉగ్రవాదాన్ని అణచివేచే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం కార్యదర్శిగా నియమించింది.
పెహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్నీ బద్ధలు కొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్‌కీ బాత్ 121 వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. పెహల్గామ్‌లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని నిరాశను ప్రతిభింభిస్తోందని అన్నారు.
భాగ్యనగరంలో ఫ్యాషన్ గ్లామర్ ప్రపంచం సరికొత్త సందడిని నెలకొల్పుతోంది. ఈవెంట్స్ రంగం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. మిస్ వరల్డ్ పోటీలకు తొలిసారిగా ఆతిథ్యమివ్వడం .. నగరానికి మరింత గ్లోబల్ లుక్ తెచ్చిపెడుతోంది.
‘‘మా దేశంలో ఉగ్రవాదులే లేరు.. వాళ్లకు మేము ఎలాంటి సాయం చేయట్లేదు’’.. ఇది చాలా ఏళ్లుగా పాకిస్తాన్ చెబుతున్న మాట. కానీ ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ రక్షణ మంత్రే సంచలన నిజాన్ని బయటపెట్టాడు.
జమ్మూకాశ్వీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకూ ప్రదర్శన చేశారు.
తిరుమలలో మరోసారి భద్రతా డొల్లతనం బయటపడింది. ఓ వైపు పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా.. అన్యమత బొమ్మ ఉన్న కారు తనిఖీ కేంద్రాన్ని దాటుకుని తిరుమలకు చేరుకుంది.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక ముందడుగు పడింది. ఏ8 గా ఉన్న చాణక్యనాథుడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతన్ని అరెస్ట్ చేశారు.