అమరావతికి బిల్ గేట్స్..
ABN, Publish Date - Feb 16 , 2026 | 11:29 AM
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు స్వాగతం పలికారు.
అమరావతి: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇవాళ (సోమవారం) ఏపీలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయన.. అనంతరం అమరావతి సచివాలయానికి విచ్చేశారు. బిల్ గేట్స్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో బిల్ గేట్స్ సమావేశం అయ్యారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టులను గేట్స్ బృందం పరిశీలించనుంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఈ వీడియోలు చూడండి:
ఆదియోగి ముందు శివ తాండవం! హారతి ఇస్తూ డ్యాన్స్‌తో అదరగొట్టారు!
పరిపూర్ణమైన జీవితం అంటే తినడం, పడుకోవడం మాత్రమే కాదు.
Updated at - Feb 16 , 2026 | 12:05 PM