దేవాలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఆలయాల్లో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
బయ్యారం ఉక్కు తెలంగాణ, ఆదివాసీల హక్కుగా నినదిస్తూ వచ్చామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని ప్రతిపాదించారని పేర్కొన్నారు.
డ్రగ్స్ నిర్మూలనను ప్రజా ఉద్యమంగా మార్చడంలో మీడియా కీలక భాగస్వామిగా ఉండాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో నిరంతర అవగాహన కల్పించడంలో మీడియా ముందుండాలని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ముత్తోజిపేట దగ్గర మినీ ట్రక్కు బోల్తాపడి ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలు అయ్యాయి.
హనుమకొండకు చెందిన నిరంజన్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. చిన్నారితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.
మలుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప దేవాలయం సమీపంలోని మరో అపు రూప కట్టడానికి జాతీయ స్థాయి రక్షణ లభిం చింది.
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పాడి పంటలు, పశు సంరక్షణ కలగాలని.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని.. ప్రకృతిని తలచుకుని సంప్రదాయబద్ధంగా ఏడుగురు కుల దేవతల్లో ఒకరైన సీత్లా భవానిని కొలిచి జరుపుకునే పండుగ సీత్లా పండుగ.
జనగామ జిల్లాలో రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. జనగామ పట్టణంలోని పూర్ణిమ కాలనీకి చెందిన పగిడిపల్లి మల్లయ్య అనే రిటైర్డ్ టీచర్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
వరంగల్‌కు ముంపు భయంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించారు.