వరంగల్ కోర్ట్ ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డయల్100 నెంబర్‌కి ఫోన్ చేసి చెప్పడంతో పోలీస్ అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.
బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష గట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నంత వరకు కార్యకర్తలను కాపాడుకుంటానని కొండా మురళి హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.
తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.
మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్‌కు మంగళవారం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దులో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఏవోబీలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
Warangal News: పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటపై పోలీస్‌స్టేషన్‌లోనే యువతి బంధువులు దాడి చేశారు. ప్రేమించుకున్న జంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రేమ జంటకు ఆశ్రయం ఇచ్చిన వారిపై కూడా దాడికి దిగారు.
డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో డోర్నకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్యానాయక్‌తో మరికొంతమంది నేతలపై పోలీసులు కేను నమోదు చేశారు.
Telangana Formation Day: జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వరంగల్ జిల్లాలో పలువురు మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేయనున్నారు.
జనగామ జిల్లాలోని పాలకుర్తిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటు విషయంలో వివాదం రాజుకుంది. దీంతో నేతలు పోటాపోటీగా ఘర్షణ పడుతున్నారు.