భాగ్యనగరంలో మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్లు కొనుగోలు చేసుకున్న ప్రయాణికులు మెట్రో స్టేషన్ల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాన్పూర్ సెంట్రల్- మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ సెప్టెంబర్ 2 నుంచి రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఈత చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో పాత కక్షలు, ఇంటి పక్కన ఉన్న ఈత చెట్టు వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
‘తమ్ముడూ లేరా.. ఈరోజు రాఖీ పండుగ. నీ అక్కతో రాఖీ కట్టించుకో..’ అని విలపిస్తూ ఆ సోదరి తన తమ్ముడి మృతదేహానికి రక్ష కట్టింది. ఈ దృశ్యాన్ని చూసి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబమే కాదు.. బంధువులు, స్థానికులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ హృదయవిదారక ఘటన..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది.
సైబర్ మోసాల్లోనూ ‘గోల్డెన్ అవర్’ కీలకమని పోలీసులు అంటున్నారు. ఆన్‌లైన్ మోసానికి గురైన వెంటనే బాధితులు ఫిర్యాదు చేస్తే మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన డబ్బును రికవరీ చేయవచ్చని చెబుతున్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి, అనంతరం నకిలీ నియామక పత్రాలు అందించారనే ఆరోపణలపై భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌పై చీటింగ్ కేసు నమోదైంది.
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్‌నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో ఓ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఫెరోజ్ బిన్ సుల్తాన్ (24) అనే యువకుడు మృతి చెందాడు.