సూర్యాపేట క్రైం, మే 27 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు నిర్వహించే వాహనాల తనిఖీల ద్వారా తప్పుచేసే వారిలో భయం కలుగుతోందని కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు.
భూసారంతో పాటు పర్యావరణానికి, ఆస్తులకు నష్టం కలిగిస్తోన్న వరికొయ్యల కాల్చివేతపై అవగాహన పెరగాల్సి ఉంది. గ్రామాల్లో రైతులు ఒకరిని చూసి ఒకరు పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు.
ప్రైవేట్ విద్యాసంస్థల యజమాన్యాలు స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. విద్యార్థుల నమోదును పెంచుకునేందుకు చేసే వివిధ ప్రయత్నాల్లో ఇందులో భాగంగా గ్రామాల నుంచి పిల్లలను పాఠశాలలకు తీసుకొచ్చేందుకు బస్సులను ఏర్పాటుచేస్తుంటారు.
నాగార్జునసాగర్, మే27(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో కుడికాల్వలో ప్రాజెక్టు అధి కారులు సోమవారం రాత్రి తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల చేశారు.
మద్దిరాల, మే 27(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించడానికి నానా రైతులు కష్టాలుతప్పడం లేదు.
వైద్య ఆరోగ్య శాఖలో కీలక విభాగం 104 లో పనిచేసిన ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారింది. 104 సిబ్బంది ప్రధానంగా మారుమూల గ్రామాల ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులకు గురైతే వారికి అవగాహన కల్పించడంతో పాటు మందులు అందజేస్తారు.
గ్రామపంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రానికి రూ.9,968 కోట్లు కేటాయించారు. అయితే జిల్లా విషయానికొచ్చే సరికి 481 పంచాయతీలకు రూ.40 నుంచి రూ.50 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి.
వానాకాలం సీజన్ సాగుకు ఉపయోగపడాల్సిన మూసీ ప్రాజెక్ట్ నీరు వృథాగా పో తోంది. తూము షట్టర్ మరమ్మతుకు రావడంతో ప్రతి రోజూ 30 క్యూసెక్కుల నీరు కుడి కాల్వలోకి వెళ్తుందని అధికారులు చెబుతున్నా అంతకంటే ఎక్కువగానే పోతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సాధించిన భూదాన్‌పోచంపల్లి ‘ఇక్కత్’ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు జిల్లా అధికార యంత్రంగం రంగం సిద్ధంచేసింది.
నాగార్జునసాగర్, మే 26(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిఽధిలో క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న నివాసితులను ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఎన్‌ఎస్పీ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు.