వైభవంగా ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:53 PM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక అలంకరణలో తీర్చిదిద్ది అధిష్టింపజేశారు. పండితులు వేద మంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ ఉదయం తిరుమంజన స్నపనం, ప్రబంధ సేవాకాలం దివ్య ప్రబంధ ఆధ్యాపకులు నిర్వహించారు. సాయంత్రం స్వామివారు, తిరుమమంగైఆళ్వార్‌కు తిరువీధి సేవలో దివ్య ప్రబంధ సేవాకాలం చేపటి ్ట రాత్రి నివేదన తీర్థప్రసాద గోష్టితో ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి. పూజల్లో ఆలయ ఈవో ఎస్.వెంకట్రావు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో డిసెంబరు మాసంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా ప్రచారం నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఈవో ఎస్.వెంకట్రావు చెప్పారు. పట్టణంలోని తులసీ కాటేజీలో ప్రచార రథానికి మరమ్మతులు పూర్తి చేసి గురువారం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల డిసెంబరు మూడవ, నాలుగవ వారాల్లో ఏఈవోలు ప్రతాప నవీనకుమార్‌శర్మ, గజ్వేల్లి రఘు నోడల్ అధికారులుగా భూపాలపల్లి, నాగర్‌కుర్నూల్ జిల్లాల్లో స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించేందుకు నిర్ణయించినట్లు వివరించారు. పల్లెల్లో నిర్వహించే స్వామి కల్యాణోత్సవం గ్రామీణ భక్తులు కనులారా వీక్షించి ఆశీస్సులు పొందాలని ఈవో కోరారు. ఇరువురు అధికారులు సమన్వయంతో స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. దశల వారిగా వివిధ ప్రాంతాల్లో దేవస్థానానికి చెందిన రథం ద్వారా ప్రచార నిర్వహించి విశిష్టత, ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృత పర్చేందుకు ఆదేశించారు కొంతకాలంగా మూలన పడిన ప్రచార రథానికి మరమ్మతులు చేయించిన వాహనంతో భక్తుల సౌకర్యార్థం మారు మూల పల్లెల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు.