అధిక లాభాల ఆశ చూపి రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కొట్టేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తెల్లాపూర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి పెద్ద మొత్తం డబ్బులు వస్తాయని నమ్మించి ట్రేడింగ్ యాప్ ద్వారా దాదాపు రూ.33 లక్షల మేర పెట్టుబడి పెట్టించారు నిందితులు.
మానవుడికి ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో బోడ కాకరకాయ ఒక్కటి. వీటిని అకాకరకాయ, అడవి కాకరకాయ అని పిలుస్తారు.
దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్లలో మూడు తెలంగాణాకు రాబోతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ బుల్లెట్ ట్రైన్ల ద్వారా రూ.5 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో ఈ మూడు బుల్లెట్ ట్రైన్లు గేమ్ చెంజర్ కాబోతున్నాయని వివరించారు.
ఇస్నాపూర్‌లో అదృశ్యమైన బిహార్‌కు చెందిన నలుగురు బాలికలు సురక్షితంగా ఉన్నారని పటాన్‌చెరు పోలీసులు ఆదివారం వెల్లడించారు. మరికాసేపట్లో తల్లిదండ్రులకు ఆ బాలికలను అప్పగిస్తామని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
ఆషాఢమాసం వచ్చిందంటే చాలు... ప్రతి ఒక్కరికీ గోరింటాకు గుర్తుకువస్తుంది. ఇంటింటా గోరింట సందడి నెలకొంటుంది.
మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి విమర్శించారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు.
నిజమైన లబ్ధిదారులకే రేషన్ అందేలా చూడటం కోసం రేషన్‌కార్డుదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం బాచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 161పై ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ప్రమాదవశాత్తూ స్కార్పియో వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు.