KCR Dasara Celebrations In Farm House: దసరా వేడుకుల్లో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్
ABN , Publish Date - Oct 02 , 2025 | 06:22 PM
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గమ్మకి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆయుధ పూజను నిర్వహించారు.
సిద్దిపేట, అక్టోబర్ 02: తెలుగు రాష్ట్రాల్లో దసరా సంబరాలు అంబరాన్ని (KCR Dasara Celebrations 2025) అంటుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దఎత్తున ఆలయాలకు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు సైతం పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) సైతం దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఇవాళ (గురువారం) దుర్గమ్మకి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో జరిగిన ఆయుధ పూజా కార్యక్రమంలో తన భార్య శోభతో కలిసి కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకున్నారు. ఈ పూజలో కేటీఆర్ దంపతులతోపాటు కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో మాజీ హోంమంత్రి మహబూబ్ అలీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మహబూబ్ అలీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీ వర్షాలు.. జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు
లోకేశ్ ఒక తపస్సే చేశారు: హోం మంత్రి అనిత
For More Telangana News And Telugu News