Home Minister Key Comments On Minister Lokesh: లోకేశ్ ఒక తపస్సే చేశారు: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Oct 02 , 2025 | 05:33 PM
మెగా డీఎస్సీ కోసం విద్య మంత్రి నారా లోకేశ్ ఒక తపస్సే చేశారని హోం మంత్రి అనిత వెల్లడించారు. గతంలో తాను టీచర్‌నని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సీఎంగా చంద్రబాబు ఉన్నారని చెప్పారు.
అనకాపల్లి, అక్టోబర్ 02: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ కోసం ఒక తపస్సే చేశారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మెగా డీఎస్సీ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఈ మెగా డీఎస్సీ విషయంలో 140 కోర్టు కేసులు వేశారని ఆమె గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో మంత్రి లోకేశ్ ఎన్నో మార్పులు తీసుకు వచ్చారంటూ సోదాహరణగా వివరించారు. పాఠశాల అంటే ఒక దేవాలయం అని భావించి-ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని లోకేష్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి హోం మంత్రి అనిత భోజనం చేశారు.
గురువారం దసరా పర్వదినం నేపథ్యంలో మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో మెగా డిఎస్సీకి ఎంపికైనా ఉపాధ్యాయులకు వేంపాడు టోల్ ఫ్లాజా సమీపంలో భారతీ కన్వెన్షన్ హాల్‌లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో తొమ్మిది డీఎస్సీలు నిర్వహించారని చెప్పారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను టీచర్‌నని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.
2002 టీచర్‌గా ఉన్నా తాను ప్రస్తుతం ఆయన కేబినెట్‌లో తనను మంత్రిగా సీఎం చంద్రబాబు చేశారని వివరించారు. తాను టీచర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాను కాబట్టే.. ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల బాధ్యత అని స్ఫష్టం చేశారు. విద్యార్థికి టీచర్ ఒక స్ఫూర్తి అని తెలిపారు. మీరు ఏ పాఠశాలలో జాయిన్ అవుతారో.. అక్కడ తాను ఇచ్చే మొక్కను నాటాలని ఈ సందర్భంగా వారికి హోం మంత్రి అనిత సూచించారు.
అంతకుముందు గురువారం గాంధీ జయంతి నేపథ్యంలో ఆయన చిత్రపటానికి ఆమె పూలమాల వేసి.. ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనం చేసి.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 147 మంది ఉపాధ్యాయులను సర్టిఫికేట్లు అందజేసి.. వారిని నూతన వస్త్రాలు, శాలువాతోపాటు ఒక్కొ మొక్కను మంత్రి అనిత అందజేసి ఘనంగా సత్కరించారు. తొలుత పాయకరావు పేట మండలం పీఎల్ పురానికి చెందిన బి. ధనలక్ష్మీకి అపాయింట్‌మెంట్ అర్డర్‌ను హోం మంత్రి అందజేశారు. రాబోయే తరాలను తయారు చేసే ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా మంత్రి అనిత శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దసరా వేళ విషాదం.. పూజ చేస్తూ కుప్పకూలిన పూజారి..
గాంధీజీ మార్గం యువతకు మార్గదర్శకం
For More AP News And Telugu News