Priest Collapses in Temple: దసరా వేళ విషాదం.. పూజ చేస్తూ కుప్పకూలిన పూజారి..
ABN , Publish Date - Oct 02 , 2025 | 05:02 PM
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలోని అమ్మవారి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ పురోహితుడు కుప్పకూలిపోయాడు.
నెల్లూరు, అక్టోబర్ 02: దేవాలయంలో పూజలు చేస్తూ పూజారి ఒక్కసారిగా మృతిచెందిన ఘటన సంచలనంగా మారింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీవెంగమాంబ దేవాలయంలో సురేశ్ అనే వ్యక్తి పూజారీగా విధులు నిర్వహిస్తున్నారు. దసరా పండగ నేపథ్యంలో గురువారం పూజలు చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడే ఉన్న భక్తులకు తొలుత ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే తేరుకున్న భక్తులు 108కి ఫోన్ చేశారు. 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పూజారి సురేశ్‌ను పరీక్షించారు.
నాడి అందడం లేదంటూ సురేశ్ ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు వెంటనే.. సురేశ్‌ను ప్రైవేట్ వాహనంలో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. పండగ రోజు కావడంతో వైద్యులు అందుబాటులో లేకుండాపోయారు. ఇక విధిలేని పరిస్థితుల్లో సురేశ్ ను వింజమూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతిచెందాడని తెలిపారు. 108 సిబ్బంది నిర్లక్ష్యం, ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది లేకపోవడం వల్లే పూజారి సురేశ్ మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News