Share News

Pawan Kalyan Gandhi Jayanti: గాంధీజీ మార్గం యువతకు మార్గదర్శకం

ABN , Publish Date - Oct 02 , 2025 | 02:08 PM

గాంధీజీ సిద్ధాంతాలు భావి తరాలకి తెలియాలి. మహాత్మా గాంధీజీ ప్రబోధించిన సత్యం, అహింస... మానవాళి నిత్య జీవనానికి బలమైన శక్తినిస్తాయి. గాంధీజీ వాటిని స్వయంగా ఆచరించి, వాటి శక్తిని చూపించారు. ఆ మహాత్ముడి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.

Pawan Kalyan Gandhi Jayanti: గాంధీజీ మార్గం యువతకు మార్గదర్శకం
Pawan Kalyan Gandhi Jayanti:

అమరావతి, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ (జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) నివాళి అర్పించారు. గాంధీ సిద్ధాంతాలు భావితరాలకు తెలియాలని అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా గాంధీజీకి ఉప ముఖ్యమంత్రి అంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన మార్గాన్ని అధ్యయనం చేయాలన్నారు. చేసేత రంగానికి ఊతమిద్దామంటూ డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


పవన్ ట్వీట్..

‘గాంధీజీ సిద్ధాంతాలు భావి తరాలకి తెలియాలి. మహాత్మా గాంధీజీ ప్రబోధించిన సత్యం, అహింస... మానవాళి నిత్య జీవనానికి బలమైన శక్తినిస్తాయి. గాంధీజీ వాటిని స్వయంగా ఆచరించి, వాటి శక్తిని చూపించారు. ఆ మహాత్ముడి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన అనుసరించిన మార్గాన్ని అధ్యయనం చేయాలి. ఆ స్ఫూర్తితో నేడు ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయాలని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అందరం స్వీకరించాలి. తద్వారా స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం పెంచగలము. మన చేనేత రంగానికి ఊతం ఇద్దాం. సత్యం, అహింస, సత్యాగ్రహమే ఆయుధాలుగా స్వాతంత్ర్య ఉద్యమాన్ని తనదైన శైలిలో ముందుండి నడిపించిన స్వాతంత్ర్యోద్యమ నాయకుడు మహాత్మా గాంధీ. ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి

విశాఖలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

Read latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 03:07 PM