Share News

Tirumala Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:58 PM

కానుకల ద్వారా రూ.25.12 కోట్ల హుండీ ఆదాయం లభించిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 28 లక్షలకు పైగా లడ్డూలను భక్తులకు విక్రయించామని.. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశామని వివరించారు.

Tirumala Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
Tirumala Brahmotsavam

తిరుమల, అక్టోబర్ 2: శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు (గురువారం) మీడియాతో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ చరిత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యంత బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. టీటీడీ కల్పించిన సదుపాయాలు, సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారన్నారు.


అలాగే కానుకల ద్వారా రూ.25.12 కోట్ల హుండీ ఆదాయం లభించిందని తెలిపారు. 28 లక్షలకు పైగా లడ్డూలను భక్తులకు విక్రయించామని.. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశామని వివరించారు. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారన్నారు. ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 4.40 లక్షల మంది భక్తులు.. తిరుమల నుంచి తిరుపతికి 5.22 లక్షలు మంది భక్తులు ప్రయాణించారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన మంత్రి నిమ్మల

విశాఖలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా

Read latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 03:15 PM