CM Chandrababu Review Meeting On Rains: భారీ వర్షాలు.. జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 02 , 2025 | 05:59 PM
వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి, అక్టోబర్ 02: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం నాడు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని వారికి సూచించారు. అప్రమత్తంగా ఉండాలంటూ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ప్రజలను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేయాలంటూ స్పష్టం చేశారు.
కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అలాగే మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు.. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ ఉన్నతాధికారులకు సీఎం స్పష్టం చేశారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులతోపాటు వరద ముప్పు పొంచి ఉందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దసరా వేళ విషాదం.. పూజ చేస్తూ కుప్పకూలిన పూజారి..
లోకేశ్ ఒక తపస్సే చేశారు: హోం మంత్రి అనిత
For More AP News And Telugu News