Bank Manager Shock: పిల్లలు అడిగిన ప్రశ్నకు అవాక్కైన బ్యాంకు మేనేజర్!
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:20 PM
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని బర్దీపూర్ గ్రామానికి సునీత అనే మహిళకు దేవాన్ష్, రహస్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ సంఘం తరపున తనకు వచ్చే డబ్బులు తీసుకునేందుకు గ్రామంలోని కెనరా బ్యాంకు(Canara Bank)కు సునీత వెళ్లారు. దసరా సెలవులు కావడంతో సునీత తన ఇద్దరి పిల్లలను సైతం బ్యాంకుకు తీసుకెళ్లింది.
నేటికాలంలో పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు. వారు చేసే కొన్ని పనులు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. కొందరు పిల్లలు తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ గడప తొక్కిన ఘటనలు ఉన్నాయి. అంతేకాక మరికొందరు పిల్లలు అయితే ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను సైతం పలు సమస్యలపై ప్రశ్నిస్తుంటారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
సైకిల్ కొనుక్కోవడానికి లోన్ కావాలంటూ ఇద్దరు చిన్నారులు నేరుగా బ్యాంకు మేనేజర్‌ను(Bank Manager) దగ్గరికి వెళ్లారు. అంతేకాక తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకుని లోన్ ఇవ్వమని ఆ చిన్నారులు అన్నారు. అంతేకాక మాకు రుణం ఇస్తే .. మేము మీకు బంగారం ఇస్తామంటూ ఆ పిల్లల చెప్పిన అమాయక మాటలకు బ్యాంకు సిబ్బందితో పాటు, మేనేజర్ ఆశ్చర్యపోయారు. సంగారెడ్డి జిల్లాలోని(Sanga Reddy District) ఝరాసంగం మండలంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని బర్దీపూర్ గ్రామానికి సునీత అనే మహిళకు దేవాన్ష్, రహస్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ సంఘం తరపున తనకు వచ్చే డబ్బులు తీసుకునేందుకు గ్రామంలోని కెనరా బ్యాంకు(Canara Bank)కు సునీత వెళ్లారు. దసరా సెలవులు కావడంతో సునీత తన ఇద్దరి పిల్లలను సైతం బ్యాంకుకు తీసుకెళ్లింది. అవసరానికి బ్యాంకులు డబ్బులు ఇస్తాయని వారు అక్కడ ఉన్న వ్యక్తుల ద్వారా తెలుసుకున్నారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారనే విషయం తెలుసుకున్న ఆ పిల్లలు నేరుగా బ్యాంకు మేనేజర్ దగ్గరకు వెళ్లారు. తాము ఆడుకోవడానికి సైకిల్ కావాలని, ఒక సైకిల్ కొనుక్కుంటాం.. దయచేసి డబ్బులు ఇవ్వండని సదరు మేనేజర్‌ని అడిగారు. అంతే ఒక్కసారిగా ఆ బ్యాంకు అధికారి షాకయ్యాడు.
ఇదే సమయంలో బ్యాంక్ మేనేజర్ సైతం వారి మాటలకు రియాక్ట్ అయ్యారు. ఏంటీ సైకిల్ కొనేందుకు మీకు డబ్బులు కావాలా?, డబ్బులు కావాలంటే తాకట్టుగా ఏం పెడతారని చిన్నారులతో బ్యాంక్ మేనేజర్ సరదాగా అన్నారు. అందుకు చిన్నారులు ఏమాత్రం తడుముకోకుండా.. తమ దగ్గర భూమి, బంగారం(Gold) కూడా ఉందని, మీకు ఏదికావాలో చెప్పండి తాకట్టు పెడతాం అని అన్నారు. చిన్నారుల అమాయకత్వం, ఆత్మవిశ్వాసం చూసి మేనేజర్ తెగ నవ్వుకున్నారు. ఈ అరుదైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!