Harish Rao Siddipet: రైతు మరింత విజయాలు సాధించాలి: హరీష్ రావు
ABN , Publish Date - Oct 02 , 2025 | 01:48 PM
తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో నడవాలని హరీష్ రావు ఆకాంక్షించారు. ఈ రాష్ట్రం చిన్న రాష్ట్రమైనా, కొత్త రాష్ట్రమైనా కేసీఆర్ నాయకత్వంలో దేశానికి దశదిశను నిర్దేశించిందని చెప్పుకొచ్చారు.
సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 2: విజయదశమి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల దేవాలయంలో నిర్వహించిన జమ్మి పూజల్లో మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయదశమి మరెన్నో విజయాలను అందించాలని, అందరి కోరికలు నెరవేరాలని అమ్మవారిని మనసారా ప్రార్థించానని తెలిపారు. తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో నడవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ రాష్ట్రం చిన్న రాష్ట్రమైనా, కొత్త రాష్ట్రమైనా కేసీఆర్ నాయకత్వంలో దేశానికి దశదిశను నిర్దేశించిందని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ ప్రారంభించిన పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో దేశంలో రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. రైతు మరింత విజయాలు సాధించాలని కోరుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ మాజీ మంత్రి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
సేవకు పెట్టింది పేరు సిద్దిపేట..
అంతకు ముందు.. పట్టణంలో అమర్‌నాథ్ సేవా సమితి భవనం భూమి పూజా కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. సిద్దిపేట అంటే సేవకు పెట్టింది పేరన్నారు. అమర్‌నాథ్ సేవలు సర్వజన హితమని వెల్లడించారు. అమర్ నాథ్ సేవా సమితి సేవలు విశ్వ వ్యాప్తమన్నారు. సిద్దిపేటలో అమర్ నాథ్ సేవా సమితి భవన నిర్మాణం చేయడం అభిందనీయమని కొనియాడారు. సిద్దిపేట అంటే సేవ, సామాజిక, ధార్మిక ఆధ్యాత్మికతకు నిలయమని తెలిపారు. సిద్దిపేటలో ఆరంభం చేసిన అన్నదానం అమర్ నాథ్, కేదార్‌నాథ్, అయోధ్య వరకు సాగుతుందన్నారు. సామాజిక సేవకు అన్నదాన కార్యక్రమాలకు సిద్దిపేట నిలయంగా మారిందని హరీష్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
విశాఖలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
Read latest Telangana News And Telugu News