Adluri Challenge: అక్కడకు మేం వస్తాం.. మీరు వస్తారా.. హరీష్‌కు అడ్లూరి సవాల్
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:18 PM
10 ఏళ్లు అధికారంలో ఉండి అలా అనడం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి. ఒక మాజీ ఎమ్మెల్యేతో తనను తిట్టించడం దారుణమని మండిపడ్డారు. హరీష్ భజన మండలితో తనను తిట్టించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
సిద్దిపేట, అక్టోబర్ 25: కేబినెట్ మీటింగ్‌న ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని హరీష్ రావు దండుపాళ్యం బ్యాచ్ అనడం బాధాకరమన్నారు. తమను అవహేళన చేశారని.. ఉద్యమ నాయకుడు ఇలా అనడం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో హరీష్ రావు మంత్రిగా పని చేశారని.. ఆ విషయం హరీష్ మరవద్దని అన్నారు మంత్రి. మంత్రి వర్గంలో ప్రజలకు అవసరం అయ్యో మీటింగ్ తప్ప.. దండుపాళ్యం లాగా దోచుకోవడం కోసం మీటింగ్ పెట్టలేదని స్పష్టం చేశారు.
10 ఏళ్లు అధికారంలో ఉండి అలా అనడం బాధాకరమన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేతో తనను తిట్టించడం దారుణమని మండిపడ్డారు. హరీష్ భజన మండలితో తనను తిట్టించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తెలంగాణా ఏర్పాటులో తాము కూడా త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఇంతగా టార్గెట్ చేయడం ఏంటని సీరియస్ అయ్యారు.
2014 బీఆర్‌ఎస్ హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రి, ఇంటి కో ఉద్యోగం లాంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రిని ఏకవచనంతో మాట్లాడటం ఏంటంటూ ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో ఎప్పుడైనా ఒక్క నియామక పత్రం ఇచ్చారా అని అడిగారు. బీఆర్‌ఎస్ చేసిన అప్పులకు మిత్తీలు కట్టుకుంటూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలును నేరవేర్చక పొతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ పాలన, రెండేళ్లలో కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ‘హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము వస్తాం మీరు వస్తారా’ అంటూ ఛాలెంజ్ చేశారు.
42 శాతం బీసీ రిజర్వేషన్‌ను కేంద్రం ఎందుకు అమలు చేయడంలేదో రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘నేను వివాదం చేయడానికి ఇక్కడికి రాలేదు. మాకు ఆస్తులు, ఫామ్ హౌస్‌లు కాదు మా దళితులకు ఆత్మగౌరవం ముఖ్యం. జూబ్లీహిల్స్, గ్రామస్తాయి ఎన్నికలు ఉన్నాయ్ అందులో ప్రజలు ఎవరికీ బ్రహ్మరథం పడుతారో చూద్దాం’ అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.
కాగా.. ఈరోజు ఉదయం పట్టణంలోని వెంకటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రికి పూర్ణకుంభంతో ఆలయ పూజారులు, అధికారులు స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్
Read Latest Telangana News And Telugu News