Sadashivpet News: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సుపై తెగిపడిన విద్యుత్ తీగ
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:08 PM
విద్యుత్ తీగ పాఠశాల బస్సుపై తెగిపడటంతో విద్యుత్ శాఖపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే.. తీగ తెగిపడిందని ఆరోపిస్తున్నారు.
సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలో ఘోర ప్రమాదం తప్పింది. పాఠశాలకు వెళ్తుండగా.. పాఠశాల బస్సుపై విద్యుత్ తీగ తెగిపడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి విద్యార్థులను కిందకి దించారు. పక్కనే ఉన్న స్థానికులు కూడా సహయం చేయడంతో.. బస్సులోని విద్యార్థులు అందరూ క్షేమంగా బయటపడినట్లు సమాచారం. అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అయితే.. విద్యుత్ తీగ పాఠశాల బస్సుపై తెగిపడటంతో విద్యుత్ శాఖపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే.. తీగ తెగిపడిందని ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. విద్యార్థుల ప్రాణాలు పోయేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్