బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన పార్టీ ముఖ్య నేతలతో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో ఆయన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాాచారం.
మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న బిడ్డపై ఆ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శిబూసోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రార్థించారు. తండ్రిని కోల్పోయి దు:ఖసంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాంట్రాక్టర్లను ధనికులను చేయడానికి మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని మంత్రి వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. జస్టిస్ పీసీ గోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు.
ఎరువుల గురించి తమ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత.. సరఫరా ఎంత రావాల్సిందో ముందు తెలుసుకోవాలని సూచించారు. రామచంద్రరావు వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు
తెలంగాణకి రెండు కేంద్రమంత్రి పదవులు ఇస్తే ఓ బీసీకి మంత్రి పదవి ఇచ్చామని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. బీజేపీ 68 మంది సీఎంలను చేస్తే అందులో 21 మంది ఓబీసీలు ఉన్నారని రఘునందన్ స్పష్టం చేశారు.
ఈనెల 14న రాత్రి 8 గంటలకు వరిగుంతం వద్ద కాంగ్రెస్ కీలక నేత అనిల్ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.
రేవంత్ ప్రభుత్వం అన్నదాతలని ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీమంత్రి హరీష్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌లోకి కాళేశ్వరం నీళ్లు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు.
Congress Leader Shot Dead: హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులతో అనిల్‌కు ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. నానక్‌రామ్ గూడాలోని ఆరు గుంటల స్థలం విషయంలో వారి మధ్య పది రోజుల క్రితం గొడవ జరిగినట్లు సమాచారం.
Missing Workers Sigachi Factory: 8 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, మాంసపు ముద్దలు, రక్తంతో ఉన్న రాళ్లను సేకరించి 70కి పైగా శాంపిల్స్‌ను డీఎన్‌ఏ రిపోర్టుల కోసం అధికారులు పంపించారు.