Share News

మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను.. అతి కిరాతకంగా చంపిన భర్త..

ABN , Publish Date - Apr 06 , 2026 | 01:12 PM

వివాహేతర సంబంధం పెట్టుకుని మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను.. అతి కిరాతకంగా చంపిన భర్త..
Sangareddy News

సంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 6: జహీరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యను భర్త హత్య చేసిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కవిత (29) అనే మహిళ ఈ నెల 27న తన ప్రియుడు పవన్ రెడ్డితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. మార్చి 30న జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కవిత జడ్చర్లలో తన ప్రియుడితో ఉన్నట్లు గుర్తించారు.


ఆమెను తిరిగి జహీరాబాద్‌కు తీసుకురావడానికి పోలీసులతో భర్త సిద్ధారెడ్డి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో సదాశివపేట మండలం నందికంది సమీపంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన సిద్ధారెడ్డి.. కత్తితో కవిత గొంతులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన కవితను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించిన యూట్యూబర్స్ అరెస్ట్

సీఎం రేవంత్‌పై అసత్యాలు ప్రచారం.. బండి సంజయ్‌పై వీరేశం ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 06 , 2026 | 02:54 PM