మావోయిస్ట్ పార్టీ కీలక నేత సోది కేశాలు లొంగుబాటు
ABN , Publish Date - Apr 06 , 2026 | 10:06 AM
మావోయిస్టు పార్టీ కీలక నేత పీఎల్‌జీఏ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లా లొంగిపోయారు. ఆదివారం మల్లాతో పాటు 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
హైదరాబాద్, ఏప్రిల్ 6: మావోయిస్టు పార్టీ కీలక నేత పీఎల్‌జీఏ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లా లొంగిపోయారు. ఆదివారం మల్లాతో పాటు 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏకే 47తో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను పోలీసులకు స్వాధీనం చేశారు. ఈ లొంగుబాటును అధికారులు అతి త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
డెడ్‌లైన్ ముగిసింది..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మావోయిస్టులకు విధించిన డెడ్‌లైన్ మార్చి 31వ తేదీతో ముగిసింది. అమిత్‌షా వార్నింగ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏపీ, తెలంగాణలకు చెందిన ఎంతో మంది కీలక నేతలు ఉన్నారు. ఇకపై ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వారు చెప్పారు. జీవితాంతం ప్రజా ఉద్యమాలకే అంకితమని లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న అలియాస్ సంగ్రామ్ అన్నారు. గతంలో లాగా మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్ళే ఆలోచన లేదని, ప్రజా సమస్యల సాధన కోసమే తన జీవితం అంకితమన్నారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ 2026: భువనేశ్వర్ అరుదైన రికార్డు..
సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు.. ముఠా అరెస్ట్