సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు.. ముఠా అరెస్ట్
ABN , Publish Date - Apr 06 , 2026 | 09:29 AM
సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాల వివరాలు అందజేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమీషన్ల కోసం బ్యాంక్ ఖాతాలను నేరగాళ్లకు ఇచ్చి, అక్రమ లావాదేవీలకు సహకరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
హైదరాబాద్, ఏప్రిల్ 6: సైబర్ నేరాలకు సహకరిస్తున్న ముఠాను మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ వంటి కేసుల్లో కీలక నిందితులకు బ్యాంక్ ఖాతాల వివరాలు అందజేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమీషన్ల కోసం బ్యాంక్ ఖాతాలను నేరగాళ్లకు ఇచ్చి, అక్రమ లావాదేవీలకు సహకరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఖమ్మం జిల్లాకు చెందిన అక్బర్, బానోతు మాన్సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఐజాజ్ ఉల్ హక్, సూర్యపేటకు చెందిన వినోద్ ఈ నెట్వర్క్‌లో భాగంగా ఉన్నారని గుర్తించారు.
వీరు సైబర్ నేరగాళ్లతో సంబంధాలు పెంచుకొని, బ్యాంక్ ఖాతాల వివరాలను వారికి అందిస్తూ మోసాలకు పాల్పడ్డారు. ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలకు చెందిన గంధం చిన్న జాకబ్, రేవంత్, విద్యాచరణ్, శివ వర్మ, పవన్, శివ, శేఖర్, కార్తీకేయ వర్మ, నోర్దన్ శివలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఈ తరహా మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి...
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
Read Latest Telangana News And Telugu News