జాతరలో డీజే డ్యాన్స్ పెట్టిన చిచ్చు.. ఆస్పత్రి ప్రాంగణంలో కత్తులతో దాడి..
ABN , Publish Date - Apr 06 , 2026 | 09:03 AM
జాతరలో డీజే డ్యాన్స్ కారణంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జాతరలో డీజే డ్యాన్స్ కారణంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కడప శివారులోని ఆలంఖాన్‌పల్లెలో ఆదివారం రాత్రి గంగమ్మ జాతర జరిగింది. జాతర సందర్భంగా డీజే డ్యాన్స్ వద్ద రెండు వర్గాల మద్య గొడవ మొదలైంది. ఆ గొడవ చిలికి చిలికి గాలి వానలా తయారైంది. రెండు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి.
ఈ దాడుల్లో పెద్ద దస్తగిరి, చిన్న సిద్ధయ్యలు గాయపడ్డారు. ఇద్దరూ చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ప్రత్యర్థులు ఆస్పత్రి దగ్గరకు వచ్చారు. ఈ సారి ఆస్పత్రి ప్రాంగణంలో దస్తగిరి, సిద్ధయ్యలపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో పెద్ద దస్తగిరి ప్రాణాలు కోల్పోయాడు. చిన్న సిద్ధయ్య తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు సిద్ధయ్యను మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2026: చెన్నై ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్
చిన్నస్వామి స్టేడియంలో అనిల్ కుంబ్లే, ద్రవిడ్‌లకు అరుదైన గౌరవం