Share News

ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..

ABN , Publish Date - Apr 06 , 2026 | 07:45 AM

ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. మే 31వ తేదీ వరకు ఇజ్రాయెల్‌కు విమాన సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ధ్రువీకరించారు.

ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
Air India Israel flights

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. మే 31వ తేదీ వరకు ఇజ్రాయెల్‌కు విమాన సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ధ్రువీకరించారు. న్యూఢిల్లీ నుంచి టెల్ అవివ్ వెళ్లే విమాన సర్వీసులు మే 31వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక, ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇజ్రాయెల్‌లోని దాదాపు 40 వేల మంది భారతీయులపై ప్రభావం పడనుంది. వ్యక్తిగత, ఉద్యోగ కారణాలతో అక్కడ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారు.


యుద్ధం నేపథ్యంలో చాలా మంది ఇజ్రాయెల్ విడిచి పెట్టి తమ దేశానికి రావాలని చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దవటం వారిని ఇబ్బందుల్లో పడేయనుంది. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని సంస్థలు మాత్రమే కఠిన ఆంక్షల మధ్య వివిధ దేశాలకు విమానాలను తిప్పుతున్నాయి. గత జనవరి నెలలోనే న్యూఢిల్లీ నుంచి టెల్ అవివ్‌కు డైరెక్ట్ ఫ్లైట్‌ సర్వీసులను ఎయిర్ ఇండియా మొదలుపెట్టింది.


ఇందుకోసం అత్యాధునికమైన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాన్ని ఉపయోగిస్తోంది. అయితే, ఊహించని విధంగా ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభం అవటంతో మొత్తానికి ఇజ్రాయెల్‌కు వెళ్లే సర్వీసులే రద్దయ్యాయి. శనివారం ఇజ్రాయెల్‌లో భారత రాయబారి జేపీ సింగ్, ఎంబరీ సిబ్బంది ఇజ్రాయెల్‌లో ఉన్న పలువురు భారతీయులతో వర్చువల్ డిస్కషన్ నిర్వహించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు .. ఈ సారి ఎంతంటే..

భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు

Updated Date - Apr 06 , 2026 | 07:49 AM