Share News

గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు .. ఈ సారి ఎంతంటే..

ABN , Publish Date - Apr 06 , 2026 | 06:59 AM

యుద్ధం ప్రారంభం అవడానికి ముందు 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 1,90,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. యుద్ధం ప్రారంభం అవగానే ధరలు ఢమాల్ అని పడిపోయాయి.

గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు .. ఈ సారి ఎంతంటే..
gold prices today

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లలో అనిశ్చితి నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. అమెరికన్ డాలర్ విలువ పెరగటం కూడా బంగారం ధరలు తగ్గటానికి కారణంగా నిలుస్తోంది. యుద్ధం ప్రారంభం అవడానికి ముందు 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 1,90,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. యుద్ధం ప్రారంభం అవగానే ధరలు ఢమాల్ అని పడిపోయాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 1.5 లక్షల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.


హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..

గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం సోమవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,50,920 దగ్గర.. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 1,38,340 దగ్గర.. 18 క్యారెట్స్ బంగారం ధర రూ.1,13,190 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. కేజీ వెండి ధర 2,54,900 రూపాయలుగా ఉంది. 100 గ్రాముల వెండి ధర 25,490 రూపాయలుగా ఉంది.


ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్స్ బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)

  • హైదరాబాద్: రూ.1,50,920

  • విజయవాడ: రూ.1,50,920

  • విశాఖపట్నం: రూ.1,50,920

  • ముంబై: రూ.1,50,920

  • బెంగళూరు: రూ.1,50,920

  • ఢిల్లీ: రూ.1,51,070

  • చెన్నై: రూ.1,52,170

  • సూరత్: రూ.1,50,970


గమనిక: పైన పేర్కొన్న బంగారం రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ఇవి కూడా చదవండి

భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ థీమ్‌ అర్థమైతే పట్టు లభించినట్టే!

Updated Date - Apr 06 , 2026 | 07:02 AM