Share News

సీఎం రేవంత్‌పై అసత్యాలు ప్రచారం.. బండి సంజయ్‌పై వీరేశం ఫైర్

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:20 PM

సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌పై అసత్యాలు ప్రచారం.. బండి సంజయ్‌పై వీరేశం ఫైర్
Vemula Veeresham

హైదరాబాద్, ఏప్రిల్ 6: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం(Vemula Veeresham) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌కు పని చేయడం చేతకాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) కలిసి పని చేయాలని హితవుపలికారు. సీఎం రేవంత్‌పై బండి సంజయ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. దక్షిణాది నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్.. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగనివ్వమని చెప్పకుండా.. సీఎంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.


దేశభక్తి తనకే ఉన్నట్లు బండి సంజయ్ మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. గాంధీ కుటుంబం దేశం కోసం రక్తాన్ని ధారపోసిందన్నారు. అలాంటి చరిత్ర ఉన్న పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ అని వెల్లడించారు. పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ప్రజల తరఫున సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. సీఎం మాటలకు బీజేపీ నాయకులు భయపడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన బండి సంజయ్.. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించారు. వాస్తవాలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవాకులు చెవాకులు మాట్లాడొద్దని ప్రభుత్వ విప్ వేముల వీరేశం హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు.. ముఠా అరెస్ట్

గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించిన యూట్యూబర్స్ అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 06 , 2026 | 12:24 PM