అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:22 AM
తూర్పుగోదావరి జిల్లాలో ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
తూర్పుగోదావరి, ఏప్రిల్ 6: మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాపేశ్వరం శివారు పేకేటిపాకలు వద్ద ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందారు. కాకినాడ నుంచి వెలగతోడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న బోగిల్లి వీర వెంకట సతీష్ (40), ఆయన భార్య బోగిల్లి కిరణ్మయి (36) నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
కారు కాలువలోకి దూసుకెళ్లిన వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్తులు అందులోని వ్యక్తులను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే భార్యాభర్తలు చనిపోగా.. కారు వెనుక సీట్లో ఉన్న వృద్ధ దంపతులు, ఇద్దరు చిన్నపిల్లలను రక్షించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
నాలుగు లేగ దూడలపై పెద్దపులి దాడి..
విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం: పీవీఎన్ మాధవ్
Read Latest AP News And Telugu News