Share News

నాలుగు లేగ దూడలపై పెద్దపులి దాడి..

ABN , Publish Date - Apr 06 , 2026 | 10:24 AM

పోలవరం జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. నాలుగు లేగదూడలపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో గిరిజనలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

నాలుగు లేగ దూడలపై పెద్దపులి దాడి..
Tiger Attack

పోలవరం, ఏప్రిల్ 6: పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దండంగి గ్రామం వద్ద నాలుగు లేగ దూడలపై పెద్దపులి దాడి చేసి చంపేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పెద్దపులి వీరవరంలోని కొండ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పూడిపల్లి, నాగలపల్లి, బోడిగూడెం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ దూడలను వేటాడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.


పెద్దపులి సంచారంతో గిరిజన గ్రామాల్లో భయాందోళన చెందుతున్న ప్రజలు.. అటవీ శాఖ అధికారులు పులిని బంధించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులి సంచారంతో రాత్రివేళ ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. పశువులను కాపాడుకోవడం కష్టంగా మారిందిన గిరిజనులు వాపోతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి పులిని బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు.. ముఠా అరెస్ట్

గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించిన యూట్యూబర్స్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2026 | 10:35 AM