కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారన్నారు.
తెలంగాణలో కోటీ యాభై లక్షల టన్నుల ధాన్యం పండించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 75 లక్షల టన్నుల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలోని వి.వెంకటాయపాలెంలో వెటర్నరీ ఆసుపత్రిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. వెంకటాయపాలెం గ్రామానికి జిల్లాలో ఓ చరిత్ర ఉందన్నారు.
అమరుల త్యాగాల పునాదులు మీద తెలంగాణ అవతరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అమరుల త్యాగాల స్పూర్తిగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనను అందిస్తున్నామని పేర్కొన్నారు.
రెండేళ్ల కిందట మున్నేరు వరదలకు తీవ్ర నష్టం చవిచూశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో రూ. 690 కోట్లతో ప్రోటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇవాళ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో ఆయన సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించారు.
దేశంలో అన్నిరకాల పంటలను తమ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వరిధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రైతులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో వరి రైతులు ఎవరూ అధైర్య పడవద్దని భరోసా కల్పించారు.
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. పూజ్యులు ఎన్టీఆర్ పాలనలో భద్రాచలం రామాలయం అభివృద్ధి చేసే భాగ్యం దక్కిందని మంత్రి తెలిపారు.