Share News

విద్యార్థుల బస్సును ఢీకొన్న లారీ.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:54 PM

ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది విద్యార్థులు ఉన్నారు.

విద్యార్థుల బస్సును ఢీకొన్న లారీ.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..
School Bus Accident

ఖమ్మం జిల్లా, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన విద్యార్థులను బస్సు నుంచి బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.


పోలీసుల దర్యాప్తు..

ఘటనా స్థలానికి చేరుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, లారీని స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. పాఠశాల వాహనాల డ్రైవర్లు , భారీ వాహనాల డ్రైవర్లు రద్దీ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 07 , 2026 | 04:55 PM