Share News

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల కేసులో ఏడుగురి అరెస్టు..

ABN , Publish Date - Apr 02 , 2026 | 07:49 PM

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల పేరుతో పేదలను దోచుకున్నారంటూ ఏడుగురిని ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు. భూములు ఇప్పిస్తామంటూ నిరుపేదలను లక్షల్లో మోసం చేశారంటూ బల్లి శ్రీనివాస్, పోలెబోయిన ముత్తయ్య, కొప్పెర వెంకన్న, తాళ్లూరి కృష్ణ, కుంజా కృష్ణయ్య, కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారిని అరెస్టు చేశారు.

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల కేసులో ఏడుగురి అరెస్టు..
Bhoodan Land Scam

ఖమ్మం జిల్లా: వెలుగుమట్ల భూదాన్ భూముల పేరుతో పేదలను దోచుకున్నారంటూ ఏడుగురిని ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు. భూములు ఇప్పిస్తామంటూ నిరుపేదలను లక్షల్లో మోసం చేశారంటూ బల్లి శ్రీనివాస్, పోలెబోయిన ముత్తయ్య, కొప్పెర వెంకన్న, తాళ్లూరి కృష్ణ, కుంజా కృష్ణయ్య, కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారిని అరెస్టు చేశారు. నిరుపేదల నుంచి ఆ దళారీలు దోచుకున్న డబ్బును రికవరీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


నగదు వసూళ్లకు పాల్పడిన వారంతా ఆ సొమ్ముతో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వాహనాలు, ఇతర ఆస్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేకునేందుకు చట్టపరమైన చర్యలను అధికారులు చేపట్టారు. భూదాన్ భూములు ఇప్పిస్తామంటూ మెుత్తం 1,549 మంది నిరుపేదలను దళారీలు మోసగించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ నగదు రికవరీ చేసి బాధితులకు ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.


రాత్రికి రాత్రే భారీ వాహనాలతో వందల ఇళ్లను కూలగొట్టారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ మేరకు అక్కడ పలుమార్లు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, భూదాన్ భూములను పలువురు ఆక్రమించారని స్థానిక మంత్రులు ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు చెప్పిన విధంగానే పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. అయితే, భూదాన్ భూములను ఇప్పిస్తామని చెప్పి గతంలో పేదల నుంచి నిందితులు లక్షల వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి
హోర్ముజ్‌ను తెరిపించేందుకు చర్చలు.. భారత్‌కు యూకే ఆహ్వానం

పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి.. ఇంజనీర్లను సన్మానించిన మంత్రి

Updated Date - Apr 02 , 2026 | 08:47 PM