Share News

పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి.. ఇంజనీర్లను సన్మానించిన మంత్రి

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:49 PM

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో డయాఫ్రం వాల్ పూర్తయి మెయిన్ డ్యామ్ పనులు జరుగుతున్నాయన్నారు.

పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి.. ఇంజనీర్లను సన్మానించిన మంత్రి

పోలవరం, ఏప్రిల్ 02: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో డయాఫ్రం వాల్ పూర్తయి మెయిన్ డ్యామ్ పనులు జరుగుతున్నాయన్నారు. గురువారం పోలవరం ప్రాజెక్టు వద్ద పూర్తయిన డయాఫ్రం వాల్ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.


అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 1,372 మీటర్ల పొడవైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని 440 రోజుల్లో పూర్తి చేశామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 18 నెలలు శ్రమించి నిర్మించిన డయాఫ్రం వాల్‌ను గత జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని గుర్తు చేశారు. జగన్ విధ్వంసానికి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి అదనంగా మరో రూ.1000 కోట్లు ఖర్చు అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2025 జనవరి 18వ తేదీన ఈ డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి.. ఈ రోజు పూర్తి చేశామని వివరించారు.


2020 ఆగస్టులో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింటే, 2021 జూన్, అదే ఏడాది డిసెంబర్, 2022 జూన్‌లో దీనిని పూర్తి చేస్తామని వైఎస్ జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. ప్రాజెక్టుకు డయాఫ్రం వాల్ ఉందో లేదో తెలియని స్థితిలో నాటి ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని వ్యంగ్యంగా అన్నారు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు గాడిలో పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో.. ఈ నిర్మాణంలో భాగమైన ఇంజనీర్లు, సిబ్బందిని మంత్రి నిమ్మల రామానాయుడు సన్మానించి.. వారికి స్వీట్లు తినిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదం.. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

ఈ సమయంలో ఎంపీగా ఉండడం సంతోషంగా ఉంది: కేశినేని చిన్ని

For More AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 06:56 PM