ఈ సమయంలో ఎంపీగా ఉండడం సంతోషంగా ఉంది: కేశినేని చిన్ని
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:36 PM
రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో ఐదు కోట్ల ఆంధ్రులలో పట్టలేని ఆనందాన్ని నింపుతుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 02: రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో ఐదు కోట్ల ఆంధ్రులలో పట్టలేని ఆనందాన్ని నింపుతుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. పార్లమెంట్‌లో రాజధాని అమరావతి బిల్లు చట్టబద్ధత పొందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదానికి కృషి చేసిన ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
గురువారం అమరావతిలో ఎంపీ కేశినేని చిన్న విలేకర్లతో మాట్లాడుతూ.. అమరావతి బిల్లు పార్లమెంటులో ఆమోదానికి వచ్చే సమయంలో ఆ ప్రాంతంలోని విజయవాడ ఎంపీగా తాను ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఈ బిల్లు చట్టబద్ధతకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యువ నేత, మంత్రి నారా లోకేశ్‌కు కేశినేని చిన్ని ధన్యవాదాలు తెలిపారు.
ఇకపై ఎటువంటి గందరగోళం ఉండదు: రామకృష్ణ
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం పట్ల ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. గురువారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. రాజధానిపై ఉన్న గందరగోళానికి తెర దించుతూ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్రం చట్టబద్ధత కల్పించడం సంతోషంగా ఉందన్నారు. రాజధాని అమరావతిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొందామని అనుకున్నామన్నారు.
అలాంటి తరుణంలో మూడు రాజధానులు పేరుతో వైసీపీ గందరగోళానికి తెర తీసిందని రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో ఇకపై రాష్ట్రంలో ఎటువంటి గందరగోళం ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము సైతం పూర్తిగా సహకరిస్తామని ఈ సందర్భంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు
రాజధానికి పట్టిన గ్రహణం వీడింది: మంత్రి లోకేశ్
For More AP News And Telugu News