రాజధానికి పట్టిన గ్రహణం వీడింది: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:52 PM
రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లుల ఆమోదంతో రాజధానికి పట్టిన గ్రహణం వీడిందని ఆయన పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్02: రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లుల ఆమోదంతో రాజధానికి పట్టిన గ్రహణం వీడిందని ఆయన పేర్కొన్నారు. అమరావతికి చట్టబద్ధత వచ్చిందన్నారు. గురువారం న్యూఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ సమయంలో అమరావతికి దీప హారతులు ఇద్దామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
#APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలు షేర్ చేయండి..
గురువారం రాత్రి 7 గంటలకు అంతా ఇళ్ల ఎదుట దీపాలు వెలిగిద్దామని సూచించారు. ఈ దీపాలతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రజలను మంత్రి లోకేశ్ కోరారు. #APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో అందరూ ఫొటోలు షేర్ చేయాలని ప్రజలకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అమరావతికి సహకరించిన అందరికీ ఈ సందర్భంగా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రుల గుండెచప్పుడు అమరావతి: సానా సతీశ్
అమరావతి అంటే.. 5 కోట్ల ఆంధ్రుల గుండెచప్పుడు అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ న్యూఢిల్లీలో అభివర్ణించారు. సీఎం చంద్రబాబు పిలుపుతో రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని మండిపడ్డారు. 'మావిగన్' పేరుతో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్ చంచల మనస్తత్వానికి 'మావిగన్' ప్రతిపాదనే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో 40 పార్టీలు మద్దతు తెలిపిన రాజధాని అమరావతిని.. వైసీపీ వ్యతిరేకించడం దురదృష్టకరమని ఎంపీ సానా సతీశ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పిల్ల కాంగ్రెస్ పిల్ల చేష్టలకు నివ్వెరపోతున్న ప్రపంచం: ఎంపీ లక్ష్మణ్
రాజధానికి పట్టిన గ్రహణం వీడింది: మంత్రి లోకేశ్
For More AP News And Telugu News