తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం బిగ్ అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు.. ఆ తర్వాత..
వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - II పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
సౌదీలో సోమవారం తెల్లవారుజామును జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మరణించారు. వీరంతా హైదరాబాద్ వాసులని తెలంగాణ హజ్ కమిటీ ప్రకటన వెల్లడించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది.
పైరసీతో సినీ పరిశ్రమకు తవ్ర నష్టాన్ని కలిగిస్తున్న ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో రవి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తెలుగు సినిమా రక్షణలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ చర్యలు కీలకమైనవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.
కొంపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని వారు టెండర్లు ఎందుకు తీసుకున్నారంటూ కాంట్రాక్టర్లపై విరుచుకుపడ్డారు.
అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ను అధికారులు కూల్చివేశారు. సంధ్యా శ్రీధర్ రావు తమ ప్లాట్లను ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టారు.
ఐ బొమ్మ రవి అరెస్ట్పై సీపీ సజ్జనార్ సంచలన విషయాలు బయటపెట్టారు. పైరసీని అరికట్టే క్రమంలో ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశామని, అతడిపై మూడు పైరసీ కేసులున్నాయని తెలిపారు.
సౌదీ రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ఎనిమిది మందిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో కుటుంబంలోని ఏడుగురు చనిపోయారు.
సౌదీ అరేబియా ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు టోల్ ఫ్రీ నెబర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.