Share News

కలర్, జెండర్‌ ఆధారంగా రేట్ ఫిక్స్.. చైల్డ్ ట్రాఫికింగ్‌లో షాకింగ్ నిజాలు

ABN , Publish Date - Feb 06 , 2026 | 10:08 AM

చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠా.. శిశువు కలర్, జెండర్ ఆధారంగా రేట్లను నిర్ణయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

కలర్, జెండర్‌ ఆధారంగా రేట్ ఫిక్స్.. చైల్డ్ ట్రాఫికింగ్‌లో షాకింగ్ నిజాలు
Child trafficking

హైదరాబాద్, ఫిబ్రవరి 6: గుజరాత్‌లో పుట్టిన చిన్నారులను కొనుగోలు(Child trafficking) చేసి హైదరాబాద్‌లో అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును అహ్మదాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా రెండేళ్లలో కనీసం 25 మంది శిశువులను హైదరాబాద్‌లో విక్రయించినట్లు విచారణలో తేలింది. శిశువులకు రంగు, జెండర్ ఆధారంగా రేట్లు నిర్ణయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా మగ శిశువులు అయితే ఎక్కువ రేటుకు విక్రయించేవారని విచారణలో బయటపడింది.


వారం రోజుల క్రితం అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, గుజరాత్ యాంటీ - టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఓ కారును అడ్డగించారు. ఆ కారులో 15 రోజుల వయసుగల నవజాత శిశువును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన రోషన్ అగర్వాల్, అహ్మదాబాద్‌కు చెందిన వందన పంచాల్, సుమిత్ యాదవ్, మౌలిక్ దవే ఉన్నారు. రోషన్ అగర్వాల్ హైదరాబాద్‌లో కీలక ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు రక్షించిన శిశువును.. ప్రస్తుతం వైద్య సంరక్షణలో ఉంచారు. శిశువుకు సంబంధించిన అసలు తల్లిదండ్రులను గుర్తించే ప్రయత్నాలు చేపట్టారు పోలీసులు.


విచారణలో ఈ ముఠా గుజరాత్‌లో పుట్టిన శిశువులను రూ.1 లక్ష నుంచి రూ.3.6 లక్షల వరకు కొనుగోలు చేసి.. హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు బయటపడింది. శిశువు రంగు, జెండర్ ఆధారంగా రేట్లు ఫిక్స్ చేసిన ఈ ముఠా.. కొద్దిగా ఫెయిర్(తెల్లగా) ఉన్న శిశువులను రూ.7లక్షల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే కలర్ తక్కువగా ఉంటే రూ.4 లక్షలకు విక్రయిస్తోందని విచారణలో తేలింది. ఈ ముఠా ద్వారా విక్రయించిన శిశువుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంలో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

ఎక్కడికెళ్లినా అదే రచ్చ

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 06 , 2026 | 12:21 PM