ఎమ్మెల్సీ నివాసం, గెస్ట్‌హౌస్‌లపై డ్రోన్ల ఎగరవేత
ABN , Publish Date - Feb 06 , 2026 | 09:49 AM
బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సఢ్యుడు శంభీపూర్ రాజుకు చెందిన నివాసం, గెస్ట్‌హౌస్‌లపై డ్రోన్లు ఎగరవేయడం స్థానికంగా సంచలనం కలిగించింది. అయితే.. డ్రోన్ల ఎగురవేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బాధ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఘటనపై విచారణకు ఎమ్మెల్సీ డిమాండ్
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు(Shambhipur King)కు చెందిన శంభీపూర్‌లోని నివాసంతో పాటు బౌరంపేటలోని అతని గెస్ట్ హౌస్‌పై గురువారం మధ్యాహ్నం డ్రోన్లను ఎగురవేసిన దృశ్యం కలకలం రేపింది. అక్రమంగా డ్రోన్లను ఎగురవేస్తున్న విషయాన్ని గుర్తించిన సిబ్బంది దుండిగల్ పోలీసులకు(Dundigal Police) ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రోన్లు ఎగురవేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రజాప్రతినిధిని అయిన తన ఇంటిపై అక్రమంగా డ్రోన్లు ఎగువేసి తన రక్షణకు భంగం కలిగించడంపై శంభీపూర్ రాజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో లోతైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్రోన్‌తో పాటు ల్యాప్‌టాప్‌లు, వారు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై దుండిగల్ సీఐ సతీష్‌కుమార్ మాట్లాడుతూ, బౌరంపేటలో ప్రభుత్వం విక్రయిస్తున్న ఇసుక మేటలను డ్రోన్ ద్వారా ప్రభుత్వ అనుమతితో చిత్రీకరి స్తున్నట్టు తమ విచారణలో తేలిందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
సినిమాలు తక్కువ.. గాసిప్స్ ఎక్కువ
భాస్కరా అవార్డులాగా కేసీఆర్‌కు జాతిపితనా..!
Read Latest Telangana News and National News