ఐ బొమ్మ, బొప్పం టీవీ వెబ్ సైట్లలో కొన్ని వేల పైరసీ సినిమాలను ఉంచిన ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానించడంతో రంగంలోకి ఈడీ వస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఒక పూర్తి స్థాయి కార్యాచరణ మొదలుపెట్టింది. ఆర్టీసీ బస్సులకు యజమానులయ్యే అవకాశాన్ని ఇస్తోంది. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాలకు మొత్తం 600 బస్సులు అందించనుంది.
ఎన్‌కౌంటర్‌లో మరణించిన హిడ్మా మావోయిస్టు పార్టీలో చాలా బలమైన నాయకుడని ప్రొ. హరగోపాల్ అభివర్ణించారు. పార్టీ కోసం ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి అతడని స్పష్టం చేశారు.
ఆరో జాతీయ జల అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తెలంగాణ అధికారులకు పురస్కారాలు ప్రదానం చేశారు భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌లో బ్లాస్ట్ జరుగుతుందని ప్రయాణికులను వెంటనే ఖాళీ చేయాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్‌లో హెచ్చరించారు.
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని సూచించారు.
భాగ్యనగరంలోని ప్రముఖ హోటల్స్ యజమానుల ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది. 30 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.
శంషాబాద్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. సెకండ్ ఇయర్ విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కి పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. దాదాపు నాలుగు గంటలుగా ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు.. ఆ తర్వాత..