కాగజ్నగర్లో శనివారం వినాయక నిమజ్జన వేడుకలు అంబరాన్ని అంటాయి. పట్టణంలో 150 విగ్రహాలను ఆయా వార్డుల్లో నెలకొల్పారు. శనివారం వివిధ పూజ కార్యక్రమాలను నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు.
జిల్లాలో యూరియా కోసం నిరసనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట యూరియా ఇవ్వాలంటూ రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడిన ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని కర్ణమామిడిలో చోటు చేసుకుంది.
సరిహద్దులో రవాణాశాఖ చెక్పోస్టులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో ఎంఎస్ నంబర్ 58ని ఆగస్టు 28న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన వరదల వల్ల జరి గిన నష్టాలపై త్వరగా చర్యలు చేపట్టాలని ముఖ్యమత్రి రేవంత్రెడ్డి అన్నారు.
పెన్షన్ ఉద్యోగులకు భిక్ష కాదని అది హక్కు అని ఉద్యోగ ఉపాధ్యాయుల సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు.
కాసిపేట మండలం దేవాపూర్లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీలో యూనియన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఎన్నికలు నిర్వహిస్తుండగా, చివరి రెండురోజులు ధన ప్రవాహం జోరుగా కొనసాగింది.
జిల్లాలో బుఽధవారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షానికి తోడు ఎగువున కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది.