హిందూ సమాజ సంఘటితమే దేశ అభ్యున్నతికి మార్గం
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:37 PM
హిందూ సమాజాన్ని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లేం దుకు ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని సహ ప్రాంత ప్రచారక్ కల్పగురి ప్రభుకుమార్ అన్నారు.
- ఆర్‌ఎస్‌ఎస్ సహ ప్రాంత ప్రచార కల్పగురి ప్రభుకుమార్
ఆసిఫాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): హిందూ సమాజాన్ని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లేం దుకు ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని సహ ప్రాంత ప్రచారక్ కల్పగురి ప్రభుకుమార్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజసేవ, ఐక్యత, సహాయక భావన వంటి అంశాలను ప్రధానంగా ఉంచుకుని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శతాబ్ది దిశగా చేపడుతున్న కార్యక్ర మాలపై వివరించారు. సమాజంలోని ఆర్థిక, విద్యా, వైద్య, వంటి పలురంగాల్లో సేవలను అందిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ నిరంతర కృషి చేస్తోందని పేర్కొన్నారు. స్వార్థా న్ని వదిలి ధర్మం, సమాజ రక్షణ కోసం పనిచేయడం ప్రతీ హిందువు ధర్మమని చెప్పారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో హిం దువులపై హింసాత్మక చర్యలు జరుగుతున్నాయని, హిందువు లను విడదీసే ప్రయత్నాలు, మత మార్పిడి చర్యలు, యువ తను వ్యసనాలకు దారి తీసే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో హిందూ సంస్కృతిని దూరం చేసేందేందుకు జరుగుతున్న ప్రచారాన్ని ఎదు ర్కొనేందుకు సమాజం ఏకమై పనిచేయాలని పిలుపు నిచ్చారు. హిందువుల జనాభా తగ్గుతున్న నేపథ్యంలో సమాజ రక్షణ కోసం భవిష్యత్ తరాలను బలపరిచే దిశగా ప్రతీ కుటుంబం బాధ్యత వహించాలని సూ చించారు. ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచా రాన్ని ఖండించాలని సమాజ బలోపేతం కోసం అందరు కలిసి ముందుకు రావాలన్నారు. డిసెంబరులో జరుగున్న విరాట్ హిందూ సమ్మేళనం కోసం ప్రజలు పెద్దఎత్తున పాల్గొని సంఘటిత శక్తిని ప్రదర్శించాలని కోరారు. వచ్చే 25 సంవత్సరాల్లో భారత్‌ను విశ్వగురు స్థానంలో నిలపడం లక్ష్యంగా సంఘం పని చేస్తోందని, ప్రతి గ్రామంలో ఒక గంట అయిన శాఖ కార్యకలాపాలకు సమాయాన్ని కేటాయించాలని సూచించారు.
అంతకు ముందు జైన్ మందిర్ నుంచి కుమరం భీం చౌక్ మీదుగా సాయిబాబా ఆలయం వరకు పదసంచాలన్ నిర్వహించారు. కార్యక్రమంలో గౌతం చంద్ జైన్, కరీంనగర్ విభాగ్ సహ కార్యవాహ మాదవరపు రంగ్వామి, మంచిర్యాల జిల్లా కార్యవాహ కృష్ణభాప్కర్, డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, అరిగెల నాగేశ్వర్‌రావు, అరిగెల మల్లికార్జున్, బోనగిరి సతీష్ బాబు, జనగామ ఖండ కార్యవాహ కోటేశ్వర్‌రావు, డాక్టర్ వెంకటేష్, సభ్యులు పాల్గొన్నారు.