Share News

తలసేమియా పిల్లలకు పింఛన్‌ మంజూరు చేయండి

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:26 PM

తల సేమియా, సికిల్‌ సెల్‌తో బాధపడుతున్న పిల్లలకు పెన్షన్‌ మంజూరు చేయాలని తలసేమియా వెల్ఫేర్‌ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్‌ అన్నారు.

తలసేమియా పిల్లలకు పింఛన్‌ మంజూరు చేయండి
కలెక్టరేట్‌ ఎదుట మాట్లాడుతున్న తలసేమియా వెల్ఫేర్‌ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్‌

తలసేమియా వెల్ఫేర్‌ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్‌

ఆసిఫాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తల సేమియా, సికిల్‌ సెల్‌తో బాధపడుతున్న పిల్లలకు పెన్షన్‌ మంజూరు చేయాలని తలసేమియా వెల్ఫేర్‌ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం తలసేమియా, సికిల్‌సెల్‌ వ్యాధి గ్రస్తుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు, దివ్యాంగులకు పెన్షన్‌ మంజూరు చేయాలని కోరారు. ఆసిఫాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో రక్తం ఎక్కించి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించా లని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం నా యకులు తిరుపతి, బాపురావు, శ్రీవాణి, దయాకర్‌, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించండి..

సిర్పూర్‌(టి): సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు, మహాత్మాజ్యోతి బాఫూలే, మైనార్టీ, హాస్టల్‌కు సంబంధించి ఐదు నెలల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరుతూ కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేకు కాంట్రాక్టుర్లు ప్రజావాణి కార్యక్రమం లో వినతిపత్రం అందజేశారు.

Updated Date - Nov 17 , 2025 | 11:26 PM