సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:39 PM
మండల కేంద్రం లోని మార్కెట్ కమిటీ గోదాంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదివారం ప్రారంభించారు.
జైనూర్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం లోని మార్కెట్ కమిటీ గోదాంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత రైతుల ను శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పంట ధాన్యాలు అమ్ముకునేందుకు రైతులందరికి ఆవకాశంకల్పించేలా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. గిరిజన ప్రాంతంలో అనేక మంది గిరిజన రైతులు పంటల వివరాలు ఆన్‌లైన్ నమోదు కాలేదని దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఆదేవిధంగా గిరిజనేతర రైతుల పంట ధాన్యాలు ఆన్‌లైన్‌లో లేనందున వారు అనేక విధాలుగా నష్టపోతున్నారన్నారు. వారి పంట ధాన్యాలు ప్రభుత్వ రంగ సంస్థల ద్వార కొనుగోలు చేయాలని ఈ నెల 15న కలెక్టర్‌కు వివరించామని, త్వరలో గిరిజనేతర రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మండ లంలో నెలకొన్న సమస్యల్ని సాధ్యమైనంత వరకు పరిష్క రించేందుకు కృషి చేస్తామని భరోసా కల్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావు మాట్లాడుతు ప్రభు త్వం రైతుల పంట ధాన్యాలకు సరైన మద్దతు ధర కల్పి స్తోందన్నారు. క్వింటాలు సోయా 6,328 రూపాయల మద్దతు ధర కల్పిస్తుందన్నారు. ఆదేవిధంగా 12 శాతం తేమ కలిగి ఉం డాలని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకో వాలని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి జాడి వెంకటి సోయా కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో సహకార చైర్మన్ కొడప హన్నుపటేల్, గంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావ్, సీఈవో సోనకాంబ్లే జనార్దన్, బీఆర్‌ఎస్ మండల ఇంతీయాజ్‌లాల, ఉపాధ్యక్షులు ఆత్రం శంకర్, మాజీ ఎంపీటీసీ కుంర భగ్వంత్‌రావ్, నాయకులు లక్యా నాయక్, నాగర్ గోజే విశ్వాంబర్, మాజీ సర్పంచులు కుంర శాంరావ్, మేస్రాం నాగోరావ్, మడావి భీంరావ్, అఫ్సరోద్దిన్, ఉత్తం, ఖదీర్, అయ్యుబ్, కాంగ్రెస్ పార్టీ నాయ కులు మేస్రాం అంబాజీరావ్, మార్కెట్ సిబ్బంది బబ్లు, గాయక్‌వాడ్ దత్త తదితరులు ఉన్నారు.