Home » YSRCP
వైసీపీ ఎమ్మెల్యేలకు దొంగచాటు సంతకాలపైనే శ్రద్ధ ఉందంటూ ప్రభుత్వ విప్ ఎద్దేవా చేశారు. తమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సభకు రావాలనే చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చివరిరోజుకు చేరుకున్నాయి. దాదాపు వారం రోజులుగా.. వాడివేడీగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
వైసీపీకి చెందిన తాడేపల్లి నేత సవింద్ర రెడ్డి పిటిషన్‌పై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం సవింద్ర రెడ్డి అక్రమ నిర్బంధం కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
జగన్‌పై ఉన్న అవినీతి కేసులు, ఈడీ కేసులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుల్లో ఇంకెన్నేళ్లు జైల్లో మగ్గాల్సి ఉంటుందో..? అని అనుమానం వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో గత టీటీడీ పెద్దలు గద్దల్లా స్వామి వారి సొమ్మును దోచుకున్నారని.. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారని వర్ల రామయ్య ధ్వజమెత్తారు.
అమ్మఒడి రాలేదు తల్లికి వందనం వస్తోందంటూ వైసీపీ ఎమ్మెల్సీలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పేరిట కొందరికే పథకాన్ని పరిమితం చేశారని విమర్శించారు
గత వైసీపీ ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఇప్పుడు బకాయిలపై వాయిదా తీర్మానం అడగటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
జీఎస్టీకి అనుకూలమా, వ్యతిరేకమా అని నిన్న (సోమవారం) టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు వైసీపీ మూగబోయిందన్నారు. ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక ఎమ్మెల్సీలంతా విచ్ఛిన్నమయ్యారని ఎద్దేవా చేశారు.
జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులను పట్టించుకోలేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రబీపంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సోమవారం పలు కీలక బిల్లులపై చర్చ జరిగింది. చర్చల అనంతరం ఈ బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. మోటార్ వెహికిల్ ట్యాక్సేషన్ సవరణ బిల్లు -2025ను శాసన మండలి ఆమోదించింది.