Clash During YCP Bike Rally : వైసీపీ ర్యాలీలో ఘర్షణ

ABN, Publish Date - Dec 15 , 2025 | 04:08 PM

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలో వైసీపీ బైక్ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని.. ఇరువర్గాలకు సర్ధి చెప్పారు.

అనంతపురం, డిసెంబర్ 15: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలో వైసీపీ బైక్ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని.. ఈ ఘర్షణలో గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇరు వర్గాల వారికి పోలీసులు సర్ది చెప్పారు. నగరంలోని వైసీపీ కార్యాలయం నుంచి క్లాక్ టవర్, సప్తగిరి సర్కిల్, పాతూరు మీదుగా బుక్కరాయసముద్రం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్ రెడ్డితోపాటు కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.


ఇవి కూడా చదవండి..

మూడు దేశాల పర్యటన.. బయల్దేరిన ప్రధాని మోదీ

గ్రామీణ ఉపాధిపై కొత్త చట్టం.. లోక్‌సభకు ప్రతిపాదిత బిల్లు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated at - Dec 15 , 2025 | 04:08 PM